Abn logo
Aug 12 2021 @ 09:36AM

Goa: మైనర్ బాలిక కిడ్నాప్, అత్యాచారం

పనాజీ (గోవా): మైనర్ బాలికను కిడ్నాప్ చేసి, ఆమెపై అత్యాచారం చేసిన దారుణ ఘటన గోవాలో తాజాగా వెలుగుచూసింది. గోవా రాష్ట్రానికి చెందిన 13 ఏళ్ల బాలికను మహారాష్ట్రకు చెందిన అక్షయ్ వసంత్ నాయక్(31) అనే వ్యక్తి కిడ్నాప్ చేశాడు.గోవాలోని సతారి తాలూకా పార్వే గ్రామానికి చెందిన బాలికను మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లా దొడమార్గ్ తాలూకాకు చెందిన వసంత్ నాయక్ కిడ్నాప్ చేసి తీసుకువెళ్లి అత్యాచారం జరిపాడు. బాధిత బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గోవా పోలీసులు నిందితుడైన నాయక్ ను అరెస్టు చేశారు. జులై 25వతేదీన గోవాలోని బెనౌలిమ్ బీచ్ లో ఇద్దరు మైనర్ బాలికలపై నలుగురు వ్యక్తులు అత్యాచారం చేశారు. గోవాలో తరచూ జరుగుతున్న అత్యాచారం ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. 

క్రైమ్ మరిన్ని...