భోపాల్ (మధ్యప్రదేశ్): డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన 14 ఏళ్ల మైనర్ బాలికను తన ఇంటికి తీసుకువెళ్లి ఆమెపై అత్యాచారం చేసిన యువకుడి బాగోతం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ నగరంలో వెలుగుచూసింది. భోపాల్ నగరానికి చెందిన 23 ఏళ్ల యువకుడు 14 ఏళ్ల బాలికతో డేటింగ్ యాప్ ద్వారా స్నేహం చేశాడు. డేటింగ్ యాప్ ద్వారా తనను కలవమని చెప్పి బాలికను తన ఇంటికి రప్పించాడు. అనంతరం బాలికపై యువకుడు అత్యాచారం చేశాడు. రోడ్డుపై ఓ బాలిక ఏడుస్తూ ఉండటంతో గుర్తించిన ఓ పోలీసు కానిస్టేబుల్ ఆమెను పోలీసుస్టేషనుకు తీసుకువచ్చి విచారించి బాలిక కుటుంబసభ్యుల ఫిర్యాదు మేర పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.