Abn logo
Mar 26 2020 @ 16:14PM

సీఎం కేసీఆర్‌ ఆదేశాలను గౌరవించాలి

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆదేశాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని తెలంగాణ రాష్ట్ర మైనారిటీ కమిషన్‌ ఛైర్మన్‌ మహ్మద్‌ ఖమ్రుద్దిన్‌ అన్నారు. తెలంగాణ లాక్‌డౌన్‌ సందర్భంగా ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని, బయటకు రావద్దని ఆయన పేర్కొన్నారు. కరోనా వైరస్‌ నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా  ప్రభుత్వం నిత్యావసరాలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూస్తోందన్నారు. నిత్యావసరాల కొనుగోలు సమయంలోనూ గుంపులు గుంపలుగా కాకుండా ప్రతి ఒక్కరూ షోషల్‌ డిస్టెన్స్‌ పాటించాలని అన్నారు. అనవసరంగా బయటకు రావద్దని, ఏదైనా ముఖ్యమైన అవసరానికే బయటకు రావాలన్నారు. తెలంగాణ ప్రజల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అంకితభావంతో పనిచేస్తున్నారని ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. 

Advertisement
Advertisement
Advertisement