పుదీనా పెరుగు చట్నీ

ABN , First Publish Date - 2021-12-08T19:20:31+05:30 IST

కొత్తిమీర తరుగు- కప్పు, పుదీనా- పావు కప్పు, జీలకర్ర- స్పూను, పచ్చి మిర్చి ముక్కలు- స్పూను, అల్లం పేస్టు- అర స్పూను, పెరుగు- ముప్పావు కప్పు, నిమ్మరసం- రెండు స్పూన్లు, చాట్‌ మసాలా- పావు స్పూను, ఉప్పు

పుదీనా పెరుగు చట్నీ

కావలసిన పదార్థాలు: కొత్తిమీర తరుగు- కప్పు, పుదీనా- పావు కప్పు, జీలకర్ర- స్పూను, పచ్చి మిర్చి ముక్కలు- స్పూను, అల్లం పేస్టు- అర స్పూను, పెరుగు- ముప్పావు కప్పు, నిమ్మరసం- రెండు స్పూన్లు, చాట్‌ మసాలా- పావు స్పూను, ఉప్పు, నూనె- తగినంత, ఆవాలు- అర స్పూను, ఇంగువ- చిటికెడు.


తయారుచేసే విధానం: చిన్న మిక్సీలో కొత్తిమీర, పుదీనా, పచ్చి మిర్చి, అల్లంవెల్లుల్లి పేస్టు, నిమ్మరసం కలిపి మిక్సీలో పేస్టులా చేయాలి. ఓ గిన్నెలో పెరుగు వేసి ఈ మిశ్రమాన్ని కలపాలి. ఇందులో చాట్‌ మసాలా, ఉప్పు జతచేయాలి. ఆఖరున పోపు పెడితే సరి.

Updated Date - 2021-12-08T19:20:31+05:30 IST