Abn logo
Oct 4 2021 @ 15:40PM

అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో దేశానికి తెలంగాణ ఆదర్శం

వరంగల్: వివిధ రకాల అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేయడంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తెలంగాణ పండుగలకు సియం కేసీఆర్ ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చారని ఆయన పేర్కొన్నారు.  వరంగల్ జిల్లా రాయపర్తి ఎంపీడీవో కార్యాలయం ప్రాంగణంలో మండలంలోని మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సంధర్భంగా మహిళలు బతుకమ్మలతో ఘన స్వాగతం పలికారు.తెలంగాణ ప్రాంత సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకుంటూ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ దేశంలోనే ఆదర్శంగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ నిలిచారని మంత్రి దయాకర్ రావు అన్నారు. బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రతి ఆడబిడ్డ సంతోషంగా ఉండాలన్నదే ప్రభుత్వ ధ్యేయంగా ప్రభుత్వం బతుకమ్మ చీరల పంపిణీ చేస్తోందన్నారు.


ఆడపడుచులకు మేనమామ గా, అన్నాతమ్ముడుగా సీఎం కేసీఆర్ బతుకమ్మ కానుకగా చీరేలని అందిస్తున్నారని అన్నారు. తెలంగాణ వ‌చ్చిన త‌ర్వాత దేశంలో ఎక్క‌డా లేని విధంగా ప్ర‌భుత్వ‌మే ప్ర‌జ‌ల‌ పండుగ‌ల‌ని నిర్వ‌హిస్తున్న‌దని అన్నారు. రూ. 333 కోట్ల ఖర్చుతో రాష్ట్రంలోని ప్రతి అక్క, చెల్లె, అమ్మకు చీరెలు పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఏడు సంవత్సరాల్లో ఎంతో అభివృద్ధి సాధించామన్నారు. రెండు సంవత్సరాలుగా కరోనాతో ఎంతో ఇబ్బందులు ఎదుర్కొన్నామని, ప్రస్తుతం రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుందని అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి కృషిచేస్తామని చెప్పారు. బిజెపి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు లేవని అన్నారు. ఎర్రబెల్లి ట్రస్ట్ తరఫున నియోజకవర్గంలో నిత్యావసర సరుకులు, మాస్కులు, సానిటైజర్లు పంపిణీచేసినట్లు, 50 లక్షలు ఖర్చు పెట్టి ఆనందయ్య మందు ఇంటింటికి అందజేసినట్లు ఆయన తెలిపారు.


ఆడబిడ్డల కష్టాలను చూసి 40 వేల కోట్లు ఖర్చుపెట్టి గోదావరి నీటిని శుద్దిచేసి ఇంటింటికి నల్లా ద్వారా సురక్షిత మంచినీరు  అందజేస్తున్న మహానుభావుడు కేసిఆర్ అని ఆయన కొనియాడారు. ఆసరా పెన్షన్లు రెండు వేల పదహారుకు పెరగగడంతో ఇంటిలోని పెద్ద వారికి గౌరవం పెరిగిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వ్యాక్సిన్ తీసుకుంటే కరోనా వచ్చినా ప్రాణాపాయం ఉండదని, త్వరగా తగ్గిపోతుందని ఆయన అన్నారు. 

ఇవి కూడా చదవండిImage Caption

క్రైమ్ మరిన్ని...