Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఒలింపిక్ విజేత మీరాను చూసిన చిన్నారి ఏం చేస్తోందంటే...

న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్ గెలుచుకున్న మీరాబాయి చానూకు దేశమంతా సలాం చేస్తోంది. మీరాబాయి సాధించిన విజయం దేశంలోని యువతకు స్ఫూర్తిగా నిలిచింది. తాజాగా భారతీయ వెయిట్‌లిఫ్టర్ సతీష్ శివలింగం ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పుడిది వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఒక చిన్నారి ఒలింపిక్ విజేత మీరాబాయి చానూను అనుకరిస్తూ కనిపిస్తోంది. ఆ చిన్నారి వెనుకనున్న టీవీలో మీరాబాయి చానూ వెయిట్ లిఫ్టింగ్ ప్రదర్శన కనిపిస్తుండగా... ఈ చిన్నారి కూడా వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ కనువిందు చేస్తోంది. ఈ వీడియోను షేర్ చేసిన సతీష్ శివలింగం... ఈ చిన్నారి జూనియర్ మీరాబాయి, దీనినే ప్రేరణ అంటారని రాశారు. 

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement