Advertisement
Advertisement
Abn logo
Advertisement

24,225 మిర్చి టిక్కీల విక్రయం

గుంటూరు, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): మిర్చియార్డుకు శుక్రవారం 23,730 టిక్కీలు రాగా నిల్వ ఉన్న వాటితో కలిపి 24,225 టిక్కీలను ట్రేడర్లు కొనుగోలు చేశారు. ఇంకా 8,507 టిక్కీలు నిల్వ ఉన్నాయి. శుక్రవారం యార్డులో నాన్‌ ఏసీ కామన్‌ వెరైటీలు క్వింటాలుకు కనిష్టంగా రూ.7,000, గరిష్టంగా రూ.13,800, నాన్‌ ఏసీ స్పెషల్‌ వెరైటీలకు రూ.7,000, రూ.15,200, నాన్‌ ఏసీ తెల్లకాయలకు రూ.4,000, రూ.7,500, ఏసీ కామన్‌ వెరైటీకి రూ.7,000, రూ.13,000, ఏసీ స్పెషల్‌ వెరైటీకి రూ.7,000, రూ.16,000, ఏసీ తెల్లకాయలకు రూ.4,000, రూ.7,000 ధర లభించినట్లు యార్డు సెక్రటరీ ఐ.వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. 

  

Advertisement
Advertisement