మిర్యాల రాజకీయం రసవత్తరం

ABN , First Publish Date - 2021-12-02T06:52:01+05:30 IST

మిర్యాలగూడ నియోజకవర్గ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుం టున్నా యి. కాంగ్రెస్‌ దిగ్గజం కుందూరు జానారెడ్డి తనయుడు రఘువీర్‌రెడ్డి నియోజకవర్గంపై నజర్‌ వేయడంతో స్థానికంగా రాజకీయం వేడెక్కింది. ఎమ్మెల్యే టికెట్‌ ఆశిస్తూ ఇప్పటికే పలువురు అక్కడ పనిచేస్తుండగా బలమైన కుటుంబం నుంచి రఘువీర్‌ రంగ ప్రవేశంతో ఊహాగానాలతో స్థానిక రాజకీయాలు ఊపందు కున్నాయి.

మిర్యాల రాజకీయం రసవత్తరం

జానా తనయుడు రఘువీర్‌ నజర్‌ 

జనవరి నుంచి స్థానికంగా మకాం

బరిలో బీఎల్‌ఆర్‌ ఖాయమంటున్న అనుచరులు 

బహుముఖ పోటీ మేలంటున్న టీఆర్‌ఎస్‌ నేతలు 


(ఆంధ్రజ్యోతి ప్రతినిధి , నల్లగొండ) : మిర్యాలగూడ నియోజకవర్గ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుం టున్నా యి. కాంగ్రెస్‌ దిగ్గజం కుందూరు జానారెడ్డి తనయుడు రఘువీర్‌రెడ్డి నియోజకవర్గంపై నజర్‌ వేయడంతో స్థానికంగా రాజకీయం వేడెక్కింది. ఎమ్మెల్యే టికెట్‌ ఆశిస్తూ ఇప్పటికే పలువురు అక్కడ పనిచేస్తుండగా బలమైన కుటుంబం నుంచి రఘువీర్‌ రంగ ప్రవేశంతో ఊహాగానాలతో స్థానిక రాజకీయాలు ఊపందు కున్నాయి. ఎమ్మెల్యే కావడమే లక్ష్యంగా మరో నాయకుడు బీఎల్‌ఆర్‌ పనిచేస్తున్నారని ఆయన బరిలో ఉండటం ఖాయ మని ఆయన అనుచరవర్గం బహిరంగంగా ప్రకటిస్తుండ టంతో స్థానిక రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. కాంగ్రెస్‌ నాయకులు అలుగుబెల్లి అమరేందర్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రేపాల శ్రీనివాస్‌ మేము సైతం అంటుండటంతో చివరికి మిగి లేది ఎవరో అన్న చర్చ మొదలైంది. ఎంత ఎక్కువ మంది బరిలో ఉంటే అంత మేలన్న ఆలోచనలో టీఆర్‌ఎస్‌ నేతలు ఉన్నారు. 


వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి బరిలో ఉండాలని రఘువీర్‌రెడ్డి ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. మిర్యాలగూడలోని ఎన్‌ఎస్‌పీ క్యాంపు సమీపంలో ఓ పెద్ద నివాసాన్ని కొనుగోలు చేసినట్లు తెలిసింది. జనవరి నుంచి స్థానికంగా మకాం వేసి పూర్తిస్థాయిలో కార్యక్రమాలు చేపట్టాలనే ఆలోచనలో ఉన్న ట్లు సమాచారం. 2014 నుంచి టికెట్‌ ఆశిస్తున్నా పలు కారణాలతో తన కు ఆ అవకాశం దక్కలేదని ఈసారి అధిష్ఠానం నుంచి స్పష్టమైన హామీ ఉండడంతో ఆయన పూర్తిస్థాయిలో పనిచేయాలని నిర్ణ యించుకున్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. తండ్రి పార్టీలో సీనియర్‌ నేత కావడం, ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో రఘువీర్‌కు సుధీర్ఘ వ్యాపార సంబంధాలు ఉండడంతో ఆయనకు టికెట్‌పై భరోసా ఉన్నట్లు తెలుస్తోంది. ‘ఈ సారి రఘువీర్‌కు అవకాశమిద్దాం, మొదటి నుంచి పనిచేస్తున్న వారికి మన ప్ర భుత్వంలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పిద్దాం’ అంటూ పీసీసీ అధ్యక్షుడు రేవం త్‌రెడ్డి ఇటీవల శాలిగౌరారంలో ఓ కార్యక్రమానికి హాజరైన సందర్భంలో మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి టికెట్‌ ఆశిస్తున్న నేతలతో కామెంట్‌ చేయడం ఈ ప్రచారానికి బలం చేకూర్చింది. మిర్యాలగూడ పట్టణంలో తప్ప మిగిలిన ప్రాంతాల్లో కాంగ్రెస్‌ శ్రేణులు తమతోనే ఉన్నాయని పట్టణం లో మాజీ కౌన్సిలర్లు, ఇతరులను కలుపుకుపోయి పనిచేస్తుంటే మిగిలిన వారు ఎన్నికల నాటికి కలిసివస్తారనే ఆలోచనలో రఘువీర్‌ ఉన్నట్లు తెలిసింది. 


  బరిలో బీఎల్‌ఆర్‌ ఖాయం

రెండేళ్లుగా సొంత ఖర్చులతో మిర్యాలగూడ నియోజకవర్గంలో బత్తుల లక్ష్మారెడ్డి (బీఎల్‌ఆర్‌) అనేక కార్యక్రమాలు చేశారు. ఆయన నాయకులతో సంబంధం లేకుండా నేరుగా ప్రజల వద్దకు చేరుకునేలా కార్యక్రమాలు రూపొందించుకున్నారు. మిర్యా లగూడ మునిసిపల్‌ ఎన్నికల్లో గణనీయమైన స్థానాలను గెలిపించు కున్నారు. తమ నాయకుడు కాంగ్రెస్‌ నుంచి బరిలో ఉండాలని ఆయన అనుచరులు బలంగా ఆశిస్తున్నారు. ఇప్పటికీ ఆ పార్టీ జెండా కిందే కార్యక్రమాలు చేపడుతున్నారు. రఘువీర్‌ బరిలో దిగి కాంగ్రెస్‌ టికెట్‌ ఆయనకే దక్కినా తమ నాయకుడు బీఎల్‌ఆర్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరి లో ఉండటం ఖాయమని ఆయన అనుచరులు చెబుతున్నారు. స్థానికం గా కాంగ్రెస్‌ టికెట్‌ దక్కించుకోవడంలో ఇబ్బందులు ఉంటాయనే ఆలోచనతోనే బీఎల్‌ఆర్‌ వ్యూహాత్మకంగానే పనిచేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆయన కాంగ్రెస్‌ నేతగా కన్నా సామా జిక సేవకుడు అనే ముద్రను బలంగా వేయించుకున్నారని కాంగ్రెస్‌ దిగ్గజాల ఎత్తులు తెలిసే ఈ తరహా ప్రయత్నాలు ప్రారంభించారని విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలో బలమైన అభ్యర్థుల కోసం బీజేపీ గాలి స్తోంది. బీఎల్‌ఆర్‌కు కాంగ్రెస్‌లో టికెట్‌ దక్కని నేపథ్యంలో ఆయన బీజేపీ పంచన చేరే అవకాశం లేకపోలేదన్న వాదనలూ వినిపిస్తున్నాయి. లేనిపక్షంలో ఆర్‌ఎస్‌పీ సింహం గుర్తుపైనైనా బీఎల్‌ఆర్‌ బరిలో ఉంటారన్న చర్చ సాగుతోంది. రఘువీర్‌ మిర్యాలగూడ ఎంపీగా వెళ్తారని బీఎల్‌ఆర్‌ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని తాజా పరిణామాల నేపథ్యంలో బీఎల్‌ఆర్‌ శిబిరంలో చర్చ సాగుతోంది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన అలుగుబెల్లి అమరేందర్‌రెడ్డి పేరు స్థానికంగా చర్చ లోకి వచ్చింది. ఆయన ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగ ుతున్నారు. కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లోకి వచ్చిన భాస్కర్‌ రావుకు టీఆర్‌ఎస్‌ టికెట్‌ దక్కగా అమరేందర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌ గూటికి చేరారు. బీఎల్‌ఆర్‌ దూసుకు రావడం ఆయనకే ప్రాధాన్యత పెరగడంతో అమరేందర్‌రెడ్డి సైలెంట్‌ అయ్యారు. భవిష్య త్తులో మంచి అవకాశం కల్పిస్తామని మంత్రి కేటీఆర్‌ నుంచి అమరేందర్‌రెడ్డికి స్పష్టమైన హామీ లభించిందని, ఆయన తిరిగి టీఆర్‌ ఎస్‌లోకి వస్తారన్న ప్రచారం స్థానికంగా ఉంది. రఘువీర్‌కు అండ గా ఉండాలని, భవిష్యత్తులో ప్రాధాన్యం ఇస్తామని రేవంత్‌రెడ్డి అమ రేందర్‌రెడ్డికి హామీ ఇచ్చారని ఆయన కాంగ్రెస్‌లోనే కొనసాగుతారని ప్రచారం జరుగుతోంది. మాజీ ఎమ్మెల్యే రేపాల శ్రీనివాస్‌ ఇటీవల నుం చే కార్యక్రమాలకు వస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లపై కాంగ్రెస్‌ నేతలు ధర్నా చేపట్టగా ఆయన హాజరై ఆశ్చర్యానికి గురి చేశారు. వైఎస్‌ షర్మిల నాయకత్వంలోనే వైఎస్‌ఆర్‌టీపీ నుంచి ఆయన బరిలో ఉంటారని ప్రచారం జరగగా తాజాగా కాంగ్రెస్‌ నేతలతో కలిసి ఆందోళనల్లో పాల్గొని నేను సైతం అంటూ సం కేతాలు ఇచ్చారు. 



తమకే లాభం అంటున్న టీఆర్‌ఎస్‌ నేతలు

నియోజకవర్గంలో పెద్దఎత్తున అభివృద్ధి కార్యక్రమా లు చేపట్టామని, భారీ ఎత్తున పార్టీ సభ్యులు క్రియాశీలకం గా ఉన్నారని టీఆర్‌ఎస్‌ నాయ కులు పేర్కొంటున్నారు. ఎమ్మెల్యే భాస్కర్‌రావు స్థానికంగానే మకాం వేసి ప్రతి అంశంలోనూ ఆయన ముద్ర వేస్తున్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఫలితంగా అన్ని పార్టీల్లోని ప్రధాన నేతలంతా ప్రస్తుతం టీఆర్‌ఎస్‌లోనే ఉన్నారు. వీటన్నింటికీ తోడు ఆర్థికంగా బలంగా ఉండటం, పోల్‌ మేనేజ్మెం ట్‌లో తిరుగు లేని అనుభవం ఉండటం తమకు కలిసొచ్చే అంశాలని భాస్కర్‌రావు అనుచరులు అంటున్నారు. 

Updated Date - 2021-12-02T06:52:01+05:30 IST