కార్మిక నేత వికృత చేష్టలు.. మహిళతో అసభ్యకర సంభాషణ

ABN , First Publish Date - 2021-02-25T04:54:57+05:30 IST

కార్మిక నేత వికృత చేష్టలు.. మహిళతో అసభ్యకర సంభాషణ

కార్మిక నేత వికృత చేష్టలు.. మహిళతో అసభ్యకర సంభాషణ

సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఆడియో

ఇల్లెందు, ఫిబ్రవరి, 24:అధికార పార్టీకి చెందిన ఇల్లెందులోని ఓ కార్మిక నాయకుడు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్టు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఒక ఆడియో తీవ్ర చర్చనీయాంశమైంది. ఒక కార్మిక కుటుంబానికి చెందిన ఓ మహిళతో ఫోన్‌లో జరిగిన సంభాషణపై పోలీసులకు సదరు మహిళ ఫిర్యాదు చేసినట్టు సమా చారం. అయితే వివాదం పెద్దది కాకుండా ఆ కార్మిక నాయకుడు క్షమాపణలు చెప్పి రాజీ కుదుర్చుకున్నట్టు తెలుస్తుండగా.. ఈ వివాదం గురించి పోలీసులు మీడియాకు సమాచారం చెప్పడానికి నిరాకరించడం గమనార్హం. అయితే ఇదే విషయమై బుధ వారం రాత్రి ఇల్లెందులు పోలీసులు సదరు కార్మిక నాయకుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్టు తెలిసింది. 

Updated Date - 2021-02-25T04:54:57+05:30 IST