టీ తాగేందుకు వెళ్లిన సెక్యూరిటీ గార్డ్స్.. తిరిగి వచ్చాక ATM సెంటర్లో కనిపించిన సీన్ చూసి షాక్..!

ABN , First Publish Date - 2021-10-09T01:38:12+05:30 IST

ఎప్పటిలాగే ముగ్గురు సెక్యూరిటీ గార్డులు.. ఆ రోజు కూడా ఏటీఎం సెంటర్ వద్ద పహారా కాస్తూ ఉన్నారు. సమయం రాత్రి కావడంతో.. వారికి నిద్ర ముంచుకొచ్చింది. ఈ క్రమంలో నిద్రను పోగొ

టీ తాగేందుకు వెళ్లిన సెక్యూరిటీ గార్డ్స్.. తిరిగి వచ్చాక ATM సెంటర్లో కనిపించిన సీన్ చూసి షాక్..!

ఇంటర్నెట్ డెస్క్: ఎప్పటిలాగే ముగ్గురు సెక్యూరిటీ గార్డులు.. ఆ రోజు కూడా ఏటీఎం సెంటర్ వద్ద పహారా కాస్తూ ఉన్నారు. సమయం రాత్రి కావడంతో.. వారికి నిద్ర ముంచుకొచ్చింది. ఈ క్రమంలో నిద్రను పోగొట్టుకునేందుకు ఆ ముగ్గురు సెక్యూరిటీ గార్డులు.. టీ తాగేందుకని దగ్గర్లోని షాప్‌కు వెళ్లారు. అక్కడ వేడి వేడి టీ తాగి.. నిద్ర మత్తును వదింలించుకుని ఏటీఎం సెంటర్ వద్దకు తిరుగుపయనం అయ్యారు. అలా ఏటీఎం సెంటర్ వద్దకు వచ్చిన సెక్యూరిటీ  సిబ్బంది.. ఏటీఎం సెంటర్లో కనిపించిన దృష్యాలు చూసి ఒక్కసారిగా షాకయ్యారు. రాజస్థాన్‌లో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


రాజస్థాన్‌లోని చివారా అనే పట్టణంలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం సెంటర్లో నిత్యం ముగ్గరు సెక్యూరిటీ సిబ్బంది పహారా కాస్తూ ఉంటారు. ఎప్పటిలాగే తాజాగా ముగ్గరు సెక్యూరిటీ సిబ్బంది.. తమ విధులకు హాజరయ్యారు. అర్ధరాత్రి కావడంతో వారికి నిద్ర ముంచుకొస్తున్నట్లు అనిపించింది. డ్యూటీలో ఉండి నిద్రపోతే.. ఉద్యోగాలు ఊడతాయనే భయంతో ఆ ముగ్గరు సెక్యూరిటీ సిబ్బంది తమ నిద్రమత్తును పోగొట్టుకోవడానికి టీ తాగాలని భావించారు. ఈ క్రమంలోనే దగ్గర్లో ఉన్న టీ షాపు వెళ్లి, తిరిగి ఏటీఎం సెంటర్ వద్దకు చేరుకున్నారు. అలా ఏటీఎం సెంటర్‌కు వచ్చిన ఆ ముగ్గరు సిబ్బందికి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయింది. 



రూ.12లక్షల డబ్బు ఉన్న ఏటీఎం మెషీన్.. ఏటీఎం సెంటర్‌లో కనిపించకపోవడంతో ఆ సిబ్బంది షాక్ అయ్యారు. ఆ తర్వాత ఏటీఎం మెషీన్ కోసం చుట్టుపక్కల వెతికి.. పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు ఆ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. కాగా.. కేవలం 25 రోజుల వ్యవధిలోనే పరిసర ప్రాంతాల్లో ఇటువంటి ఐదు సంఘటనలు చోటు చేసుకోవడం.. దొంగతనానికి పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేయలేకపోవడం స్థానికంగా చర్చనీయాంశం అయింది. ఇదిలా ఉంటే.. దీనిపై పోలీసులు స్పందించారు. హర్యానాకు చెందిన గ్యాంగే ఈ దోపిడీలకు పాల్పడుతున్నట్లు అభిప్రాయపడ్డారు. ఈ ఘటనలపై సీరియస్‌గా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. 


Updated Date - 2021-10-09T01:38:12+05:30 IST