Abn logo
Oct 24 2020 @ 12:04PM

'మిస్‌ ఇండియా' పేరు కాదు... ఓ బ్రాండ్‌

Kaakateeya

'మిస్‌ ఇండియా' పేరు కాదు... ఓ బ్రాండ్‌ అని అంటోంది కీర్తిసురేశ్‌. ఈమె టైటిల్‌ పాత్రలో నటించిన చిత్రం 'మిస్‌ ఇండియా'. నరేంద్రనాథ్‌ దర్శకత్వంలో ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై మహేశ్‌ కొనేరు నిర్మించిన ఈ చిత్రం ఓటీటీ మాధ్యమంలో విడుదల కానుంది. కరోనా నేపథ్యంలో కీర్తిసురేశ్‌ నటించిన చిత్రం పెంగ్విన్‌ ఓటీటీలో విడుదలైన సంగతి తెలసిందే. అదే బాటలో కీర్తి టైటిల్‌ పాత్రలో నటించిన మరో చిత్రం 'మిస్‌ ఇండియా' కూడా నవంబర్‌ 4న ఓటీటీలో విడుదల కానుంది. దసరా సందర్భంగా చిత్ర యూనిట్‌ ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది. చిన్నప్పట్నుంచి బిజినెస్‌ చేసి ఎదగాలనుకునే ఓ అమ్మాయి.. ఏ బిజినెస్‌ స్టార్ట్‌ చేసింది. ఈ ప్రయాణంలో ఆమెకు ఎదురైన సవాళ్లేంటి? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. జగపతిబాబు, రాజేంద్ర ప్రసాద్‌, కమల్‌కామరాజు, సీనియర్‌ నరేశ్‌, నవీన్‌ చంద్ర తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. 



Advertisement
Advertisement