దుబాయిలో కేరళ వాసి మృతి.. మానసిక సమస్యలే కారణం!

ABN , First Publish Date - 2020-08-08T01:17:54+05:30 IST

దుబాయిలో ఏప్రిల్ 28 నుంచి కనబడకుండా పోయిన 54 ఏళ్ల ప్రవాసీయుడు మరణించినట్లు పోలీసులు తెలిపారు. అతని మృతదేహం కుళ్లినస్థితిలో ల

దుబాయిలో కేరళ వాసి మృతి.. మానసిక సమస్యలే కారణం!

అబుధాబి: దుబాయిలో ఏప్రిల్ 28 నుంచి కనబడకుండా పోయిన 54 ఏళ్ల ప్రవాసీయుడు మరణించినట్లు పోలీసులు తెలిపారు. అతని మృతదేహం కుళ్లినస్థితిలో లభించినట్లు వెల్లడించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కేరళకు చెందిన శ్రీధరన్ దేవకుమార్.. కొద్ది సంవత్సరాల క్రితం దుబాయ్ వెళ్లాడు. దుబాయిలోని ఓ ప్రైవేట్ కార్ల కంపెనీలో పని చేస్తున్న ఆయన.. ఏప్రిల్ 28 నుంచి కనబడకుండా పోయారు. ఈ నేపథ్యంలో దుబాయిలోని సామాజిక కార్యకర్త నసీర్ వటనపల్లి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. శ్రీధరన్ దేవకుమార్ కోసం గాలించడం ప్రారంభించారు. ఈ క్రమంలో దుబాయిలోని ఓ ప్రాంతంలో పూర్తిగా కుళ్లినస్థితిలో ఉన్న మృతదేహాన్ని గత నెలలో పోలీసులు గుర్తించారు. కాగా.. మృతదేహానికి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించగా.. వాటికి సంబంధించిన ఫలితాలు తాజాగా వెల్లడయ్యాయి. ఈ క్రమంలో శ్రీధరన్ దేవకుమార్ మరణించినట్లు పోలీసులు తేల్చేశారు. శ్రీధరన్ దేవకుమార్ మరణానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. కొవిడ్ నేపథ్యంలో శ్రీధరన్ దేవకుమార్.. మానసికంగా కుంగిపోయినట్ల అతని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కాగా.. శ్రీధరన్ దేవకుమార్ మృతదేహానికి యూఏఈలోనే అంత్యక్రియలు నిర్వహించడానికి.. అతని కుటుంబ సభ్యులు ఒప్పుకున్నట్లు నసీర్ వటనపల్లి తెలిపారు. 


Updated Date - 2020-08-08T01:17:54+05:30 IST