Abn logo
Nov 23 2020 @ 00:15AM

అదృశ్యమైన మహిళ.. శవమై తేలింది

మెదక్‌ అర్బన్‌, నవంబరు 22: అదృశ్యమైన మహిళ చెరువులో శవమై తేలిన సంఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్‌ పట్టణంలోని వాసవి నగర్‌కు చెందిన చింతల శ్రీమతి(48) శనివారం హనుమన్‌ ఆలయానికని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లింది. తిరిగి రాకపోవడంతో భర్త రవీందర్‌ పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆదివారం ఉదయం పట్టణ శివారులోని బంగ్లా చెరువులో తేలియాడుతున్న మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహం అదృశ్యమైన శ్రీమతిగా గుర్తించారు. కాగా ఆరు నెలలుగా ఆమె మతిస్థిమితంతో బాధపడుతోంది. ఈ క్రమంలోనే చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు తెలిపారు. భర్త ఫిర్యాదు మేరకు వారు కేసు దర్యాప్తు చేస్తున్నారు.