Jun 3 2021 @ 07:47AM

అమితాబ్‌, జ‌య‌ల వివాహ వార్షికోత్స‌వ వేళ... ఫొటో షేర్ చేసిన బిగ్ బీ!

బాలీవుడ్‌ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఈరోజు (జూన్ 3) తమ‌ 48 వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా పెళ్లి ఫొటోల‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ ఫొటోల‌లో బిగ్ బీ అమితాబ్-జయ నూత‌న వ‌ధూవ‌రులుగా క‌నిపిస్తున్నారు. ఈ ఫోటోలను షేర్ చేయ‌డంతోపాటు బిగ్ బీ త‌మ‌కు శుభాకాంక్ష‌లు తెలిపిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. అమితాబ్ తాను షేర్ చేసిన ఫొటో  కింద... జూన్ 3, 1973 ... మా వివాహ వార్షికోత్సవం సందర్భంగా మాకు శుభాకాంక్షలు తెలిపినందుకు ధన్యవాదాలు" అని రాశారు.