ఆ ఘనత సాధించిన తొలి బౌలర్‌గా మిచెల్ స్టార్క్

ABN , First Publish Date - 2021-12-19T02:59:30+05:30 IST

ఆస్ట్రేలియా లెఫ్టార్మ్ పేసర్ మిచెల్ స్టార్క్ అత్యంత అరుదైన రికార్డు సాధించాడు.

ఆ ఘనత సాధించిన తొలి బౌలర్‌గా మిచెల్ స్టార్క్

అడిలైడ్: ఆస్ట్రేలియా లెఫ్టార్మ్ పేసర్ మిచెల్ స్టార్క్ అత్యంత అరుదైన రికార్డు సాధించాడు. ఇంగ్లండ్‌తో ఇక్కడ జరుగుతున్న పింక్ బాల్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు పడగొట్టిన స్టార్క్ తన ఖాతాలో అరుదైన రికార్డును వేసుకున్నాడు.


అంతర్జాతీయ పింక్ బాల్ టెస్టు చరిత్రలో 50 వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్‌గా స్టార్క్ రికార్డులకెక్కాడు. మరోవైపు, ఆస్ట్రేలియా జట్టు కూడా ఓ ఘనత సాధించింది. ఇప్పటి వరకు ఆడిన 8 డే/నైట్ టెస్టుల్లోనూ విజయం సాధించింది. ఇప్పుడు మరో విజయానికి దగ్గరలో ఉంది.  


ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్‌ను 473/9 వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం ఇంగ్లండ్‌ను 236 పరుగులకు ఆలౌట్ చేసింది. దీంతో ఆసీస్‌కు భారీ ఆధిక్యం లభించింది. ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్ ఆడుతున్న కంగారూలు మూడో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 45 పరుగులు చేశారు. ఫలితంగా 282 పరుగుల ఆధిక్యం లభించింది.

Updated Date - 2021-12-19T02:59:30+05:30 IST