ఐసీసీ దశాబ్దపు క్రికెటర్‌ రేసులో కోహ్లీ

ABN , First Publish Date - 2020-11-25T09:44:34+05:30 IST

అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) పురుషుల దశాబ్దపు ఉత్తమ క్రికెటర్‌ అవార్డు రేసులో భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, స్పిన్నర్‌ అశ్విన్‌ నిలిచారు.

ఐసీసీ దశాబ్దపు క్రికెటర్‌ రేసులో కోహ్లీ

మహిళల నుంచి మిథాలీ 

ఐదు విభాగాల్లో విరాట్‌ నామినేట్‌


దుబాయ్‌: అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) పురుషుల దశాబ్దపు ఉత్తమ క్రికెటర్‌ అవార్డు రేసులో భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, స్పిన్నర్‌ అశ్విన్‌ నిలిచారు. ఈ ఇద్దరి పేర్లను ఐసీసీ ప్రతిపాదించింది. అంతేకాకుండా ఐసీసీ దశాబ్దపు అవార్డులకు చెందిన ఐదు విభాగాల్లోనూ విరాట్‌ కోహ్లీ చోటు దక్కించుకోవడం విశేషం. దశాబ్దపు టీ20, వన్డే, టెస్టు ప్లేయర్‌ రేసులతో పాటు ఐసీసీ స్పిరిట్‌ ఆఫ్‌ క్రికెట్‌ అవార్డు కోసం కూడా విరాట్‌ పోటీలో నిలిచాడు. అన్ని ఫార్మాట్లలోనూ 50కి పైగా సగటు కలిగిన కోహ్లీ 70 శతకాలతో ప్రపంచ అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు. ఇక మహిళల దశాబ్దపు ప్లేయర్‌ అవార్డు కోసం భారత వెటరన్‌ మిథాలీ రాజ్‌ రేసులో ఉంది. వివిధ కేటగిరీల్లో నామినేట్‌ అయిన క్రికెటర్ల పేర్లను ఐసీసీ వెబ్‌సైట్‌లో ఉంచారు. ఓవరాల్‌గా అత్యధిక ఓట్లు పడిన క్రికెటర్లను సదరు విభాగాల్లో విజేతగా ప్రకటిస్తారు.


వివిధ అవార్డులకు నామినేట్‌  అయిన క్రికెటర్లు

పురుషుల దశాబ్దపు ఉత్తమ క్రికెటర్‌: విరాట్‌ కోహ్లీ, అశ్విన్‌ (భారత్‌), జో రూట్‌ (ఇంగ్లండ్‌), కేన్‌ విలియమ్సన్‌ (న్యూజిలాండ్‌), స్టీవ్‌ స్మిత్‌ (ఆస్ట్రేలియా), డివిల్లీర్స్‌ (దక్షిణాఫ్రికా), సంగక్కర (శ్రీలంక).


దశాబ్దపు వన్టే క్రికెటర్‌: కోహ్లీ, ధోనీ, రోహిత్‌ (భారత్‌), డివిల్లీర్స్‌, మలింగ, సంగక్కర (శ్రీలంక), స్టార్క్‌ (ఆస్ట్రేలియా).


దశాబ్దపు టీ20 ఆటగాడు:  కోహ్లీ, రోహిత్‌, మలింగ, రషీద్‌ (అఫ్ఘానిస్థాన్‌), తాహిర్‌ (దక్షిణాఫ్రికా), ఫించ్‌ (ఆస్ట్రేలియా), క్రిస్‌ గేల్‌ (వెస్టిండీస్‌).


దశాబ్దపు టెస్టు ఆటగాడు: కోహ్లీ, విలియమ్సన్‌, స్మిత్‌, అండర్సన్‌ (ఇంగ్లండ్‌), హెరాత్‌ (శ్రీలంక), యాసిర్‌ షా (పాకిస్థాన్‌).


ఐసీసీ స్పిరిట్‌ ఆఫ్‌ క్రికెట్‌ అవార్డు: కోహ్లీ, ధోనీ, విలియమ్సన్‌, మెకల్లమ్‌, వెటోరి (కివీస్‌), మిస్బా (పాక్‌), జయవర్ధనె (శ్రీలంక), ష్రబ్‌సోల్‌, కేథరిన్‌ బ్రంట్‌ (ఇంగ్లండ్‌).


మహిళల దశాబ్దపు ప్లేయర్‌: మిథాలీ రాజ్‌, (భారత్‌), మెగ్‌ లానింగ్‌, ఎలిస్‌ పెర్రీ(ఆసీస్‌), సుజీ బేట్స్‌ (కివీస్‌), స్టెఫానీ టేలర్‌ (విండీస్‌), సారా టేలర్‌ (ఇంగ్లండ్‌).


మహిళల దశాబ్దపు వన్డే ప్లేయర్‌: మిథాలీ, జులన్‌, లానింగ్‌, ఎలిస్‌, సుజీ (కివీస్‌), స్టెఫానీ టేలర్‌ (విండీస్‌).

Updated Date - 2020-11-25T09:44:34+05:30 IST