Abn logo
Apr 5 2021 @ 04:44AM

విజేత మిథాలీ సేన

రాణించిన పూనమ్‌, మేఘన ఫ బీసీసీఐ మహిళల వన్డే టోర్నీ


రాజ్‌కోట్‌: బీసీసీఐ మహిళల వన్డే టోర్నీలో మిథాలీ రాజ్‌ సారథ్యంలోని రైల్వేస్‌ జట్టు విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో రైల్వేస్‌ 7 వికెట్లతో జార్ఖండ్‌పై విజయం సాధించి ట్రోఫీని ముద్దాడింది. తొలుత స్నేహ్‌ రాణా (3/33), మేఘనా సింగ్‌ (2/22), ఏక్తా బిస్త్‌ (2/33) దెబ్బకు.. జార్ఖండ్‌ 50 ఓవర్లలో 167 పరుగులకే ఆలౌటైంది. ఇంద్రాణి రాయ్‌ (49), కెప్టెన్‌ మణి నిహారిక (39 నాటౌట్‌) టాప్‌ స్కోరర్లు. ఛేదనలో పూనమ్‌ రౌత్‌ (59), తెలుగమ్మాయి సబ్బినేని మేఘన (53) అర్ధ సెంచరీలతో విజృంభించడంతో రైల్వేస్‌ 37 ఓవర్లలో 169/3 స్కోరు చేసి అలవోకగా నెగ్గింది. పూనమ్‌-మేఘన రెండో వికెట్‌కు 107 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 

Advertisement
Advertisement
Advertisement