TN: 13 మందితో కోవిడ్ సలహా మండలి, 12 మంది ప్రతిపక్ష నేతలే

ABN , First Publish Date - 2021-05-18T00:44:23+05:30 IST

ఈ పాలక మండలి రాష్ట్రంలో ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకోనుందని, కొత్త రాజకీయ ఒరవడికి కారణం కాబోతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ ఈ కమిటీలో భాగమై ఉండడం

TN: 13 మందితో కోవిడ్ సలహా మండలి, 12 మంది ప్రతిపక్ష నేతలే

చెన్నై: కోవిడ్‌పై పోరాటానికి 13 మంది ఎమ్మెల్యేలతో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఒక సలహా మండలిని ఏర్పాటు చేశారు. అయితే ఇందులో 12 ప్రతిపక్ష పార్టీ నేతలే ఉండడం గమనార్హం. ఏఐడీఎంకే నేత, ఆరోగ్యశాఖ మాజీ మంత్రి కూడా ఈ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. మే 13న కోవిడ్ సంక్షోభంపై జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఆమోదించిన తీర్మానాన్ని అనుసరించి ఈ బహుళ పార్టీ కమిటీని ఏర్పాటు చేశారని సమాచారం.


ముఖ్యమంత్రి స్టాలినే చైర్‌పర్సన్‌గా వ్యవహరించబోతున్న ఈ కమిటీలో డాక్టర్ ఎజిలన్ (డీఎంకే), డాక్టర్ విజయభాస్కర్ (ఏఐడీఎంకే), జీకే మణి (పీఎంకే), ఏఎం మణిరత్నం (కాంగ్రెస్), నగర్ నాగేంద్రన్ (బీజేపీ), సుశాన్ తిరుమలైకుమార్ (ఎండీఎంకే), ఎస్ఎస్ బాలాజీ (వీసీకే), టీ రామచంద్రన్ (సీపీఐ), డాక్టర్ జవహారుల్లా (ఎంఎంకే), ఆర్ ఈశ్వరన్ (కేఎండీకే), టీ వేల్మురుగన్ (టీవీకే), పూవై జగన్ మూర్తి (పీబీ), నాగై మాలి (సీపీఎం) సభ్యులుగా కొనసాగనున్నారు.


ఈ పాలక మండలి రాష్ట్రంలో ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకోనుందని, కొత్త రాజకీయ ఒరవడికి కారణం కాబోతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ ఈ కమిటీలో భాగమై ఉండడం, ముఖ్యంగా అధికార పార్టీ డీఎంకే, ప్రతిపక్ష పార్టీ అన్నాడీఎంకే మధ్య సత్సంబంధాలకు ఇది పెద్ద పీట వేయనుందని అంటున్నారు. ఈ కమిటీ విషయమై మాజీ ఆర్థిక మంత్రి, ప్రస్తుత కమిటీ సభ్యుడు సీ విజయ్‌కుమార్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ‘‘అన్ని రాజకీయ పార్టీలతో కలిపి తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సలహా మండలికి, ప్రభుత్వానికి నా సంపూర్ణ సహకారం అందిస్తాను. కోవిడ్ మొదటి వేవ్‌ నుంచి నేర్చుకున్న పాఠాల ఆధారంగా రాష్ట్రంలో కోవిడ్ నియంత్రణకు ఈ కమిటీ పని చేయగలదని ఆశిస్తున్నాను’’ అని ట్వీట్ చేశారు.

Updated Date - 2021-05-18T00:44:23+05:30 IST