బాలుడు చేసిన పనికి ముచ్చటపడి గిఫ్ట్ పంపిన సీఎం స్టాలిన్

ABN , First Publish Date - 2021-05-10T22:26:17+05:30 IST

చాలా చిన్నవయస్సే. కానీ మనసు చాలా పెద్దది. చిన్న తనంలో ఆటల చుట్టే మనసు పరిభ్రమిస్తుంది. సమాజంలో

బాలుడు చేసిన పనికి ముచ్చటపడి గిఫ్ట్ పంపిన సీఎం స్టాలిన్

చెన్నై : చాలా చిన్నవయస్సే. కానీ మనసు చాలా పెద్దది. చిన్న తనంలో ఆటల చుట్టే మనసు పరిభ్రమిస్తుంది. సమాజంలో నెలకొన్న పరిస్థితులపై అంతగా ధ్యాస వెళ్లదు. మధురైలో మాత్రం అందుకు భిన్నంగా జరిగింది. హరీశ్ వర్మన్ అనే బాలుడు ఏడేళ్ల ప్రాయంలోనే ఉదారత్వాన్ని చాటుకున్నాడు. దీనికి ముచ్చట పడ్డ ముఖ్యమంత్రి స్టాలిన్ ఆ పిల్లవాడికి ఓ బహుమానాన్ని కూడా పంపారు. 


మధురైలో హరీశ్ వర్మన్ అనే బాలుడు సైకిల్ కొనుక్కోడానికి కొన్ని డబ్బులు దాచుకుంటున్నాడు. ఇలా రెండేళ్ల పాటు దాచుకుంటున్నాడు. తండ్రి ఎలక్ట్రీషియన్. అయితే కరోనా నేపథ్యంలో ఆ పిల్లవాడి మనస్సు చలించిపోయింది. తాను దాచుకున్న డబ్బును సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఇస్తున్నట్లు ఏకంగా సీఎం స్టాలిన్‌కే ఓ లేఖ రాశారు. ఈ సొమ్మును ఓ కోవిడ్ పేషెంట్‌ చికిత్సకు అందివ్వాలని ఆ బాలుడు లేఖలో పేర్కొన్నాడు. ఈ లేఖను చూసి సీఎం స్టాలిన్ తెగ ముచ్చటపడిపోయారు. ఆ పిల్లవాడికి సైకిల్‌ను బహుమానంగా పంపించారు. ఈ సైకిల్‌ను స్థానిక ఎమ్మెల్యే, నాయకులు ఆ బాలుడికి అందించారు. దీంతో ఆ బాలుడు సైకిల్‌ను తడుముకుంటూ తెగ సంబరపడిపోయాడు. అంతేకాకుండా ఆ బాలుడికి సీఎం స్టాలిన్ ఫోన్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా చాలా జాగ్రత్తగా ఉండాలని ఆ బాలుడికి సీఎం స్టాలిన్ సూచించారు.  


Updated Date - 2021-05-10T22:26:17+05:30 IST