త్వరలో అందుబాటులోకి పాకాల ఆడిటోరియం: ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2021-05-17T05:37:14+05:30 IST

త్వరలో అందుబాటులోకి పాకాల ఆడిటోరియం: ఎమ్మెల్యే

త్వరలో అందుబాటులోకి పాకాల ఆడిటోరియం: ఎమ్మెల్యే
నర్సంపేటలో పాకాల ఆడిటోరియం పనులను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే

నర్సంపేట, మే 16 : నర్సంపేటలో రూ.5కోట్లతో నిర్మిస్తున్న పాకాల ఆడిటోరియం త్వరలో ప్రజలకు అందుబాటులోకి రానున్నట్లు ఎమ్మెల్యే పెద్ది సుదర్శ న్‌ రెడ్డి తెలిపారు. తుదిదశకు చేరిన ఆడిటోరియం పనులను మునిసిపల్‌ అధికారులతో కలిసి ఆదివా రం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోనే ఎక్కడ లేని వి ధంగా 1000ఫీట్ల సామర్థ్యంతో ఆడిటోరియం నిర్మా ణం జరుగుతుందన్నారు. రాష్ట్ర, జిల్లా అధికారిక రివ్యూలు, సభలు, సమావేశాలు, సాంస్కృతిక కార్య క్రమాల నిర్వాహణకు ఆడిటోరియం వేదికగా మార నుందన్నారు. డిజిటల్‌ సౌండ్స్‌, లైటింగ్‌తో ఆడిటోరి యం రూపుదిద్దుకుంటుందన్నారు. కార్యక్ర మంలో మునిసిపల్‌ అధికారులు, మాజీ కౌన్సిలర్‌ గుంటి కిషన్‌ పాల్గొన్నారు.

అదనంగా 20 ఆక్సిజన్‌ బెడ్‌ల ఏర్పాటు

నర్సంపేట ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో అదనం గా 20ఆక్సిజన్‌ బెడ్‌లు అందుబాటులోకి రానున్నట్లు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. ఆస్పత్రిలో ఆక్సిజన్‌ సిలిండర్లను ఆదివారం పరిశీలిచారు. అనం తరంమాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలోనే అత్యధిక ఆక్సి జన్‌ పడకలు కలిగిన నర్సంపేట ఏరియా ఆస్పత్రి నిలిచిందన్నారు. అన్ని వైద్యసౌకర్యాలతో కూడిన 40 ఆక్సిజన్‌ పడకలతోపాటు కొవిడ్‌ బాధితులకు అత్యవ సర పరిస్థితుల్లో ఇచ్చే రెమిడెసివర్‌ ఇంజక్షన్లు అం దుబాటులో ఉన్నాయన్నారు. బాధితులు అధైర్య పడొద్దని, మనోధైర్యంతో ఉండాని సూచించారు.


Updated Date - 2021-05-17T05:37:14+05:30 IST