శుద్ధి చేసిన విత్తనాలను అందించాలి: ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2021-06-18T04:43:51+05:30 IST

శుద్ధి చేసిన విత్తనాలను అందించాలి: ఎమ్మెల్యే

శుద్ధి చేసిన విత్తనాలను అందించాలి: ఎమ్మెల్యే
నర్సంపేటలో గోదాం నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే

నర్సంపేట,జూన్‌ 17 : విత్తన శుద్ధి పరిశ్రమ గోదాంలలో శుద్ధి చేసిన విత్తనాలను తయారు చేసి రైతులకు అందించా లని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విఘ్నేశ్వర రైతుఉత్పత్తి సం ఘం నిర్వాహకులకు సూచించారు. గురువారం పట్టణంలోని ఎన్టీఆర్‌నగర్‌లో రూ.60లక్షలతో నిర్మించే విత్తనశుద్ధి పరిశ్రమ గోదాం నిర్మాణ పనులకు విఘ్నేశ్వర రైతుఉత్పత్తి సంఘం అధ్యక్షుడు చిలువేరు కుమారస్వామి ఆధ్వర్యంలో శంకుస్థాప న చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ వంద శాతం సబ్సిడీపై గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ ద్వారా గోదాం నిర్మాణానికి నిధులు మం జూరైనట్టు  తెలిపారు. రాష్ట్రంలో 7 రైతు ఉత్పత్తి సంఘాల ను ప్రతిపాదించగా నర్సంపేట నియోజకవర్గంలోని నర్సంపే ట, ఖానాపురం మండలం బుధరావుపేటకు విత్తనశుద్ధి పరి శ్రమ గోదాంల నిర్మాణానికి రూ.60లక్షల వంతున మంజూ రైనట్లు తెలిపారు. రైతులు పండించిన పంటలను ఎఫ్‌పీవోల ద్వారా మద్దతు ధరతో కొనుగోలు చేసి రైతు ఉత్పత్తి సంఘా లు ఆర్థికాబ్ధివృద్ధిని సాధించాలన్నారు. కార్య క్రమంలో ముని సిపల్‌ వైస్‌చైర్మన్‌ మునుగాల వెంకట్‌రెడ్డి,  ఓడీసీఎంఎస్‌ చైర్మన్‌ గుగులోతు రామస్వామినాయక్‌,  ఎంపీపీ మోతె కళా వతి, పద్మనాభరెడ్డి, కన్వీనర్‌ గోగుల ప్రతాప్‌రెడ్డి, మోతె జైపా ల్‌రెడ్డి, కౌన్సిలర్‌ మహబూబ్‌పాషా  పాల్గొన్నారు.

బుధరావుపేటలో..

ఖానాపురం: బుధరావుపేటలో విత్తనోత్పత్తి, విత్తన శుద్ధీక రణ పరిశ్రమ నిర్మాణ పనులకు ఓడీసీఎంఎస్‌ చైర్మన్‌ గుగు లోతు రామస్వామినాయక్‌తో కలిసి గురువారం ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు సమిష్టిగా సంఘంగా ఏర్పడి నాణ్యమైన విత్తనాలను వారే తయారు చేసుకోవడం కోసం 100శాతం సబ్సిడీతో గ్రాం ట్‌ ఇన్‌ ఎయిడ్‌ ద్వారారూ.60లక్షల నిధులతో పరిశ్రమ ఏర్పా టుకు మంజూరి ఇప్పించడం జరిగిందన్నారు. దళారి వ్యవస్థ ను రూపుమాపి రైతులకు నాణ్యమైన విత్తనాలను సరసమై న ధరలకు అందించడమే ఈ సంఘం ముఖ్య ఉద్దేశమన్నా రు. కార్యక్రమంలో ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు, జడ్పీటీ సీ బత్తిని స్వప్న, ఏడీఏ శ్రీనివాసరావు, ఆర్‌ఎస్‌ఎస్‌ మండల కన్వీనర్‌ కుంచారపు వెంకట్‌రెడ్డి, సర్పంచ్‌ ప్రవీణ్‌కుమార్‌, ఎంపీడీవో సుమనవాణి, ఏవో శ్రీనివాస్‌, ఎంపీటీసీలు పూల్‌ సింగ్‌, లింగమ్మ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-18T04:43:51+05:30 IST