Abn logo
Sep 24 2021 @ 23:15PM

సీఎం కేసీఆర్‌ను కలిసిన ఎమ్మెల్యే ఆత్రం సక్కు

సీఎం కేసీఆర్‌కు పుష్పగుచ్ఛం అందజేస్తున్న ఎమ్మెల్యే ఆత్రం సక్కు

ఆసిఫాబాద్‌, సెప్టెంబరు 24: సీఎం కేసీఆర్‌ను శుక్రవారం ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే ఆత్రం సక్కు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేశారు. కుమరం భీం జిల్లాలో గిరిజన యూనివర్సిటీ మంజూరు చేయాలని, ఆదివాసీ రీసెర్చ్‌ సెంటర్‌ను మార్లవాయిలో ఏర్పాటు చేయాలని, ఆదివాసీ కళాకారులకు సాంస్కతిక సారధిలో అవకాశాలు కల్పించాలని, మారుమూల ప్రాంత ఆదివాసీ గ్రామాలకు లింకు రోడ్లు మంజూరు చేయాలని వినతిపత్రం అందజేశారు.