Advertisement
Advertisement
Abn logo
Advertisement

మినీ బస్‌డిపో ఏర్పాటు చేయాలి

- అర్టీసీ ఈడీని కోరిన ఎమ్మెల్యే అబ్రహాం

అలంపూర్‌ చౌరస్తా, డిసెంబరు  6  :  అలంపూర్‌ నియోజకవర్గంలో మినీ బస్‌ డిపో ఏర్పాటు చేయాలని అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహాం కోరారు. హైదరాబాదులోని బస్‌భవన్‌లో అర్టీసీ ఈడీ పురుషోత్తంను సోమవారం ఆయన కలిసి మాట్లాడారు. రాష్ట్ర సరిహద్దులో ఉండే అలంపూర్‌ నియోజకవర్గంలో బస్‌ డిపో లేకపోవడంతో ప్రయాణికులు, విద్యార్థులు, రైతులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. అలంపూర్‌ చౌరస్తాలో ఉద్యోగులకు బస్‌ షెల్టర్‌ కూడా లేక పోవడంతో మారుమూల పల్లెలకు బస్సు సర్వీసులు నడపలేని పరిస్థితి నెలకొందని చెప్పారు. ఇదే విషయంపై 2018లో సీఎం కేసీఆర్‌ బస్‌ డిపో ఏర్పాటుకు హామీ ఇచ్చారని గుర్తుచేశారు. అందుకు సానుకులంగా స్పందించిన ఈడీ పురుషోత్తం ఇది తమ దృష్టిలో ఉందని, వెంటనే పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది తెలిపింది. 


పనులు త్వరగా పూర్తి చేయాలి

అలంపూరు : అలంపూరు నియోజకవర్గంలోని తుంగభద్ర బ్రిడ్జి అప్రోచ్‌ రోడ్డును త్వరగా పూర్తి చే యాలని  ఆర్‌అండ్‌బీ చీఫ్‌ ఇంజనీర్‌ పి.రవీందర్‌ను అలంపూరు ఎమ్మెల్యే అబ్రహాం కోరారు. హైదరాబాదులోని (ఈఎన్‌సీ అండ్‌ ఆర్‌అండ్‌బీ) రహదా రులు, భవనాల శాఖ కార్యాలయంలో ఎమ్మెల్యే సోమవారం ఆయనను కలిసి మాట్లాడారు. అయిజ నుంచి పులికల్‌ వరకు బీటీ రోడ్డు లేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడ్తున్నారని తెలిపారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. 

Advertisement
Advertisement