Abn logo
Jan 27 2021 @ 14:29PM

అధికారులపై ఆనం రామ్‌నారాయణరెడ్డి ఆక్రోశం

నెల్లూరు: నెల్లూరు జిల్లా అధికారులపై వెంకటగిరి వైసీపీ నేత ఆనం రామ్‌నారాయణరెడ్డి ఆక్రోశం వెళ్లగక్కారు. నెల్లూరులో రిపబ్లిక్ డే పరేడ్ జరిగితే ఎమ్మెల్యేలకు ఆహ్వానం లేదన్నారు. ప్రభుత్వ గణతంత్ర వేడుకల్లో ఎమ్మెల్యేలకు చోటు దక్కలేదని ఎమ్మెల్యే ఆనం ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు అర్హత లేదా? దీనికి మేము సిగ్గుపడాలో, ఏంచేయాలో అర్థం కావడంలేదన్నారు. దీనిపై రాష్ట్ర ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తానని తెలిపారు. రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన కుండా ఆవమానించిన అధికారులపై కేసులు వేస్తానని పేర్కొన్నారు. 

Advertisement
Advertisement
Advertisement