ఎన్‌హెచ్‌ పనుల ఆలస్యంపై ఎమ్మెల్యే ఆగ్రహం

ABN , First Publish Date - 2021-06-19T05:09:09+05:30 IST

ఎర్రగుంట్లలో నేషనల్‌ హైవే పనులు నత్తనడక సాగుతుండడంపై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం వేశారు.

ఎన్‌హెచ్‌ పనుల ఆలస్యంపై ఎమ్మెల్యే ఆగ్రహం
అధికారులతో కలిసి పనులను పరిశీలించి మాట్లాడుతున్న ఎమ్మెల్యే డాక్టర్‌ సుధీర్‌రెడ్డి

ఎర్రగుంట్ల, జూన్‌ 18: ఎర్రగుంట్లలో నేషనల్‌ హైవే పనులు నత్తనడక సాగుతుండడంపై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం వేశారు. వర్షాకాలం వస్తున్నా ఇప్పటికి పనులు అలాగే ఉన్నాయని ఎప్పటికి పూర్తి చేస్తారని అధికారులను ప్రశ్నించారు. శుక్రవారం ఎన్‌హెచ్‌ అధికారులతో ఎమ్మెల్యే ప్రత్యేక సమావేశం నిర్వహించి పనులపై ఆరా తీశారు. ఇప్పటి వరకు పనులు ఆలస్యంగా జరుగుతున్నాయని ఇకపై జాప్యాన్ని ఉపేక్షించమన్నారు. అయితే సుంకులమ్మ గుడివైపు నుంచి డ్రైనేజి , రోడ్డు పనులు కొద్దిమేరకు స్పీడ్‌గా జరుగుతున్నా,  నాలుగు రోడ్ల కూడలి వద్ద అసలు పనులే ప్రారంభికపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 క్లియరెన్స్‌ లేనిదే పనులు ఎలా చేస్తాం..

నగరపంచాయతీ అధికారుల నుంచి నాలుగురోడ్ల వద్ద భవనాలు ఇప్పటికి సక్రంగా తొలగించలేదని పూర్తి క్లియరెన్స్‌ రాలేదని దీంతో తాము పనులు ఎలా చేయాలని ఎన్‌హెచ్‌ అధికారులు పేర్కొంటున్నారు. అసలు డ్రైనేజీ నిర్మించేందుకు నాలుగురోడ్ల కూడలి వద్ద స్థలం లేదన్నారు.  ప్రతి ఒక్కరూ ఎమ్మెల్యే పేరు చెప్పి బెదిరిస్తున్నారని అధికారులు వాపోతున్నారు. అయితే అభివృద్ధి పనులకు ఎవరు అడ్డం వచ్చినా సహించమని ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అధికారులకు తేల్చి చెప్పారు.  సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటుకు రూ.1.30 కోట్లతో ప్రతిపాదనలను పంపినట్లు ఎన్‌హెచ్‌ అధికారులు తెలిపారు. 

Updated Date - 2021-06-19T05:09:09+05:30 IST