Abn logo
Sep 28 2021 @ 13:43PM

సీఎంకు బండి సంజయ్ రాసిన లేఖ తీరును ఖండిస్తున్నాం: బాల్కసుమన్

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాసిన లేఖ తీరును ఖండిస్తున్నామని ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. సంజయ్ యాత్రకు స్పందన లేక బెకార్ మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. బురజలో బొర్రె పందికి పన్నీరు వాసన తెలీదు అన్నట్లు సంజయ్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. బడాజూట బండి సంజయ్‌కి ప్రగతిభవన్ ప్రాధాన్యత తెలీదన్నారు.  ప్రజలకు అందిస్తున్న పథకాలకు పురుడు పోసిన భవన్ ప్రగతి భవన్ అని చెప్పుకొచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఎలాంటి అవినీతి జరగలేదని కేంద్రమే చెప్పిందన్నారు. తెలంగాణ ప్రజలు బికారులు అన్న మాటలు సంజయ్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు. మొన్ననే వినాయక నిమజ్జనం ముగిసిందని- ఇక ప్రతిపక్షాల నిమర్జనం మిగిలి ఉందని - త్వరలోనే చేస్తామని బాల్కసుమన్ అన్నారు. 

ఇవి కూడా చదవండిImage Caption

క్రైమ్ మరిన్ని...