తెలంగాణ ప్రజలపై కేంద్రం కక్ష: Balka suman

ABN , First Publish Date - 2021-12-11T18:15:32+05:30 IST

తెలంగాణ ప్రజలపై కేంద్రం కక్ష పెంచుకుందని ఎమ్మెల్య బాల్క సుమన్ అన్నారు.

తెలంగాణ ప్రజలపై కేంద్రం కక్ష: Balka suman

హైదరాబాద్: తెలంగాణ ప్రజలపై కేంద్రం కక్ష పెంచుకుందని ఎమ్మెల్య బాల్క సుమన్ అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ సింగరేణిపై కేంద్రం కక్ష కట్టిందని వ్యాఖ్యానించారు. తెలంగాణ విద్యుత్ అవసరాలు తీర్చడంలో సింగరేణి ప్రముఖ పాత్ర పోషిస్తోందని తెలిపారు. సింగరేణిపై బీజేపీ కన్నుపడి కుట్రలకు పాల్పడుతోందని విమర్శించారు. నాలుగు బొగ్గు బ్లాకులను ప్రైవేట్‌పరం చేసే ఆలోచన చేస్తోందన్నారు. కేంద్రం కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతరేకంగా కార్మికులకు మద్దతుగా తాము సమ్మెలో పాల్గొన్నామని చెప్పారు. బొగ్గు బ్లాకులను వేలం వెయొద్దని సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రధానికి లేఖ రాశారని తెలిపారు.


దున్నపోతు మీద వాన కురిసినట్టు ఉంది కేంద్రం తీరని వ్యాఖ్యలు చేశారు. గుజరాత్‌లో మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్‌కు లిగ్నైట్ బ్లాకులను వేలం లేకుండా అప్పగించారని తెలిపారు. ఈ నాలుగు బొగ్గు బ్లాకులను వేలం వేయకుండా ప్రభుత్వానికి అప్పగించమని కోరితే ఇవ్వటం లేదని మండిపడ్డారు .గుజరాత్ కు ఒక నీతి...తెలంగాణకు ఒక నీతా అని ప్రశ్నించారు. మోదీకి మిత్రులైన అదానీకి అప్పగించేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు. ప్రతి అంశంలో తెలంగాణను  ఇబ్బంది పెట్టే ప్రయత్నం బీజేపీ బట్టెబాజ్ గాళ్లు చేస్తున్నారన్నారు. దీనిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించాలని బాల్క సుమన్ డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-12-11T18:15:32+05:30 IST