ఆలయ అభివృద్ధికి సహకారం

ABN , First Publish Date - 2021-05-06T05:40:34+05:30 IST

మండల కేంద్రంలోని లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా అందిస్తానని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు.

ఆలయ అభివృద్ధికి సహకారం
అభివృద్ధి పనులకు భూమి పూజ చేస్తున్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి

మల్దకల్‌, మే 5 : మండల కేంద్రంలోని లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా అందిస్తానని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఆలయంలో పలు అభివృద్ధి పనులకు బుధవారం ఆయన శ్రీకారం చుట్టారు. ముందుగా స్వామివారిని దర్ళించుకుని పూజలు చేశారు. అనంతరం, దేవాలయం చుట్టూ రూ.30 లక్షల వ్యయంతో నిర్మించనున్న షెడ్డు పనులకు భూమిపూజ చేశారు. మల్దకల్‌ మండలంలోని శేషంపల్లె గ్రామానికి చెందిన భక్తుడు ధర్మారెడ్డి షెడ్డు నిర్మాణానికి సహకారం అందిస్తున్నారు. చింతల మునిరంగస్వామి దేవాలయంలో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించనున్న ఆల య గోపుర నిర్మాణ పనులను ప్రారంభిం చారు. గోపుర నిర్మాణానికి శేషంపల్లికి చెంది న భక్తుడు జగన్‌మోహన్‌రెడ్డి ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా దాతలు ధర్మారెడ్డి, జగన్‌మోహన్‌రెడ్డిలను ఆయన శాలువాతో సన్మానించారు. అంతకు ముందు ఆలయ అధికారులు ఎమ్మెల్యేను శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్‌ ప్రహ్లాదరావు, కార్యనిర్వహణాదికారి సత్యచంద్రారెడ్డి, మల్దకల్‌ ఎంపీపీ రాజారెడ్డి, సర్పంచ్‌ యాకోబు, నరేందర్‌, చంద్రశేఖర్‌రెడ్డి, అజయ్‌, వెంకటన్న, వెంకటేశ్వరరెడ్డి, బాబూరావు పాల్గొన్నారు. 


ప్రతీ ఒక్కరు టీకా వేయించుకోవాలి

గద్వాలక్రైం : ప్రతీ ఒక్కరూ కొవిడ్‌ టీకా వేయించుకోవాలని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం ఆయన కరోనా వ్యాక్సిన్‌ రెండో డోస్‌ వేయించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ 45 ఏళ్లు పైబడిన వారికి ప్రభుత్వం ఉచితంగా టీకా అందిస్తోం దన్నారు. నాయకులు సుభాన్‌, చెన్నయ్య, రాజశేఖర్‌, రమేష్‌నాయుడు, కృష్ణకుమార్‌రెడ్డి టీకా వేయించుకున్నారు.


Updated Date - 2021-05-06T05:40:34+05:30 IST