Advertisement
Advertisement
Abn logo
Advertisement
Mar 22 2021 @ 10:59AM

ఆసరా ఫించన్లు ఎందుకివ్వడం లేదు: ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్

హైదరాబాద్: శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆసరా ఫించన్ల మంజూరుపై ప్రభుత్వాన్ని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్  ప్రశ్నించారు. గత రెండు సంవత్సరాలుగా కొత్త  ఆసరా ఫించన్లు ఇవ్వడం లేదంటూ సభలో ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ అసహనం వ్యక్తం చేశారు. కుటుంబంలో పెన్షన్ వస్తున్న వ్యక్తి చనిపోతే, అదే కుటుంబంలో అర్హత కలిగిన మరో వ్యక్తికి పెన్షన్ బదలాయింపు జరగడం లేదని ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే బొల్లం  ప్రశ్నించారు. దీనికి సంబంధిత శాఖా మంత్రి ఎర్రబెల్లి సమాధానమిచ్చారు. కరోనా కారణంగానే కొత్త పెన్షన్‌లు ఇవ్వడం లేదంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వివరణ ఇచ్చారు. 

Advertisement
Advertisement