ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘర్షణ

ABN , First Publish Date - 2021-10-08T17:17:10+05:30 IST

సంస్థాగత ఎన్నికలను పూర్తిచేసుకుని.. గ్రామ, మండల కమిటీలను ప్రకటించేందుకు ఏర్పా టు చేసిన సమావేశం కాస్తా.. నాయకుల ఆధిపత్య పోరుతో ఉద్రిక్తతకు దారి తీసింది. పదవుల ప్రకటన సమయం

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘర్షణ

                         - పాలేరు ‘గులాబీ’ శ్రేణుల బాహాబాహీ

                         - సంస్థాగత కమిటీల ప్రకటన నేపథ్యంలో వివాదం 

 

కూసుమంచి(ఖమ్మం): సంస్థాగత ఎన్నికలను పూర్తిచేసుకుని.. గ్రామ, మండల కమిటీలను ప్రకటించేందుకు ఏర్పా టు చేసిన సమావేశం కాస్తా.. నాయకుల ఆధిపత్య పోరుతో ఉద్రిక్తతకు దారి తీసింది. పదవుల ప్రకటన సమయంలో బాహా బాహీకి దిగిన సంఘటన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం జరిగింది. కూసుమంచిలోని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి క్యాంపుకార్యాలయంలో నియోజక వర్గం లోని నాలుగు మండలాలైన ఖమ్మం రూరల్‌, నేలకొండపల్లి, కూసుమంచి, తిరుమలాయ పాలేనికి సంబంధించిన గ్రామ, మండలకమిటీల ప్రకటనకోసం నాయకులు మీడియా సమావేశం ఏర్పాటుచేశారు. ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి విదేశాలకు వెళ్లగా.. నాలుగుమండలాల నాయకులు హాజరయ్యారు. ఈ క్రమంలో కూసుమంచి మండలానికి సంబంధించిన కమిటీల వివరాలను వెల్లడిస్తుండగా రాజుపేట గ్రామకమిటీని వాయిదా వేయాలని డీసీసీబీ డైరెక్టర్‌ ఇంటూరి శేఖర్‌ కోరారు. ఎమ్మెల్యే విదేశాల్లో ఉన్నందున అదొక్కటీ వాయిదా వేయాలని కోరగా, కల్లూరిగూడెం సొసైటీ అధ్యక్షుడు, రాజుపేట గ్రామానికి చెందిన వాసంశెట్టి వెంకటేశ్వర్లు జోక్యం చేసుకున్నారు. వేస్తే అన్నీ వాయిదా వేయండి, అదొక్కటే ఎందుకు వాయిదా వేస్తారంటూ ప్రశ్నించారు. దీంతో ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ బాహాబాహీకి దిగారు. దీంతో ‘మా రాజుపేట గ్రామంలో నీపెత్తనమేంటి’ వాసంశెట్టి వెంకటేశ్వర్లు ప్రశ్నించడం వారిద్దరి మధ్య ఘర్షణకు దారితీయగా.. అక్కడున్న వారు వారిని విడదీసి బయటకు పంపారు. అనంతరం అన్ని మండలాలకు చెందిన నాయకులను పంపించివేసి.. కమిటీలను ప్రకటనను వాయిదా వేస్తున్నట్లు ఎమ్మెల్యే పీఏ శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఈ నేతలు, కార్యకర్తల బాహాబాహీ దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్‌ అవడం తీవ్ర చర్చనీయాశమైంది.

Updated Date - 2021-10-08T17:17:10+05:30 IST