Abn logo
Jun 29 2021 @ 19:09PM

సర్పంచ్‌ను సస్పెండ్ చేస్తే నన్ను చేసినట్టే: ఎమ్మెల్యే ధర్మారెడ్డి

వరంగల్: సర్పంచ్‌ను సస్పెండ్ చేయటం అంటే తనను సస్పెండ్ చేసినట్టుగానే భావిస్తున్నానని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి సన్నాహక సమావేశంలో అధికారులపై ఎమ్మెల్యే ధర్మారెడ్డి మండిపడ్డారు. గీసుగొండ మండలంలోని ఊకల్ గ్రామ సర్పంచ్‌ను అన్యాయంగా సస్పెండ్ చేశారని ధర్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు సస్పెండ్ చేశారో చెప్పాలని అధికారులను ఎమ్మెల్యే ధర్మారెడ్డి ప్రశ్నించారు. అధికారులు విధులకు రాకుండానే సంతకాలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. సర్పంచ్‌ను సస్పెండ్ చేయటం అంటే తనను సస్పెండ్ చేసినట్టుగానే భావిస్తున్నానని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తెలిపారు.