ప్రజా సమస్యలను పట్టించుకోని ఎమ్మెల్యే చందర్‌

ABN , First Publish Date - 2021-06-18T05:27:35+05:30 IST

రామగుండంలో అభివృద్ధి పడకేసిందని, ప్ర జా సమస్యలు పరిష్కరించడంలో ఎమ్మెల్యే విఫలమయ్యారని బీజేపీ నాయకులు కౌశిక హరి, పీ మల్లికార్జున్‌ ఆరోపించారు.

ప్రజా సమస్యలను పట్టించుకోని ఎమ్మెల్యే చందర్‌
విలేకరుల సమావేశంలో బీజేపీ నాయకులు

- బీజేపీ నాయకుల ఆరోపణ

గోదావరిఖని, జూన్‌ 17: రామగుండంలో అభివృద్ధి పడకేసిందని, ప్ర జా సమస్యలు పరిష్కరించడంలో ఎమ్మెల్యే విఫలమయ్యారని బీజేపీ నాయకులు కౌశిక హరి, పీ మల్లికార్జున్‌ ఆరోపించారు. గురువారం స్థా నిక ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఎమ్మెల్యేగా గెలిచిన రెండున్నర సంవత్సరాల్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, సమైక్యపాలనలో రామగుండం అభివృద్ధి చెందిందన్నారు. ప్రజాసమస్యలను గాలికి వదిలి గుడికడతానంటూ కొండపైకి తిరుగుతున్నార న్నారు. మెడికల్‌ కళాశాల పోయిందని, గోదావరిఖని ప్రభుత్వాసుపత్రి లో ఆక్సిజన్‌ప్లాంట్‌ అర్ధంతరంగా నిలిచిపోయిందని, ప్రభుత్వాసుపత్రిలో సరైన వైద్య సౌకర్యంలేక రోగులు అల్లాడుతున్నారని ఆరోపించారు. బీజేపీలో ఈటల రాజేందర్‌ చేరడం హర్షనీయమని, కేసీఆర్‌ నిరంకుశ పాలనలో పనిచేయలేక ఆయన టీఆర్‌ఎస్‌కు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వచ్చారన్నారు. బండి సంజయ్‌, వివేక్‌ నాయకత్వంలో చేరడాన్ని స్వాగతిస్తున్నామని, కాంగ్రెస్‌, టీడీపీల నుంచి ఎ మ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లోకి పోయినా వారు రాజీనామా చేయలేదని, వారుకూడా రాజీనామా చేయా లని డిమాండ్‌ చేశారు. రామగుండం నుంచి ఫా ర్వర్డ్‌ బ్లాక్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కోరుకంటి చందర్‌ దమ్ముంటే తన పదవికి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌ నుంచి పోటీచేసి గెలవాలని సవాల్‌ విసిరారు. రామగుండం ప్రజా సమస్యలపై ఇక నుంచి బీజేపీ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేస్తామని, ఎమ్మె ల్యే రాజీనామా చేసే వరకు తమ పోరాటం ఆగదని చెప్పారు. విలేకరుల సమావేశంలో బీజేపీ నాయకులు పెద్దపల్లి రవీందర్‌, మహవాది రామన్న, సుల్వ లక్ష్మీనర్సయ్య, జక్కుల నరహరి, దుబాసి మల్లేష్‌, గోపగోని నవీన్‌, కల్వల సంజీవ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-06-18T05:27:35+05:30 IST