త్వరలోనే ఇళ్ల పట్టాల పంపిణీ: ఎమ్మెల్యే దివాకర్‌రావు

ABN , First Publish Date - 2020-10-01T10:38:34+05:30 IST

శ్రీరాంపూర్‌ కోల్‌బెల్ట్‌ ఏరియాలోని సింగరేణి స్థలాల్లో నివాసం ఉంటున్న 6,700 మంది కార్మిక, కార్మికేతరుల కుటుంబాలకు త్వరలోనే

త్వరలోనే ఇళ్ల పట్టాల పంపిణీ: ఎమ్మెల్యే దివాకర్‌రావు

శ్రీరాంపూర్‌, సెప్టెంబరు 30: శ్రీరాంపూర్‌ కోల్‌బెల్ట్‌ ఏరియాలోని సింగరేణి స్థలాల్లో నివాసం ఉంటున్న 6,700 మంది కార్మిక, కార్మికేతరుల కుటుంబాలకు త్వరలోనే ఇళ్ల్ల స్థలాల పట్టాలు పంపిణీ చేస్తామని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అన్నారు.  బుధవారం సాయంత్రం శ్రీరాంపూర్‌ లోని వాటర్‌ ట్యాంక్‌ ఏరియాలోని నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మన్‌ను ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. ఏళ్ల తరబడి పట్టాల కోసం ఎదురు చేస్తున్న కార్మికుల కళ నెరవేరుతోందని, తాము ఇచ్చిన వాగ్దానం అమలు చేస్తున్నామని చెప్పారు.


సింగరేణి స్థలంలో నివాసం ఉంటున్న వారికి పట్టాలు కల్పించడానికి ప్రభుత్వానికి నామినల్‌ ఫీజు కింద చెల్లించాల్సిన మొత్తాలకు చెందిన డిమాండ్‌ నోటీసులు ప్రతి ఇంటికీ అందజేస్తామన్నారు. త్వరలోనే పట్టాలు అందిస్తామన్నారు. ఏరియాలో మొట్టమొదటి సారిగా వాటర్‌ ట్యాంక్‌ ఏరియాలో ఇంటింటికీ మిషన్‌ భగీరథ పథకం ద్వారా 500 కుటుంబాలకు తాగునీరు సౌకర్యం కల్పించామన్నారు. ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటుతో ఈ ప్రాంతంలో లో ఓల్టేజి విద్యుత్‌ సమస్య తీరనుందని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ ఇసంపల్లి ప్రభాకర్‌, వైస్‌ చైర్మన్‌ తోట శ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు వంగ తిరుపతి, కౌన్సిలర్లు పంబాల గంగా ఎర్రయ్య, బెడిక లక్ష్మీ సమ్మయ్య, బండి పద్మా, నాసర్‌, హైమద్‌ కాసీం, నాయకులు మహేందర్‌, రాపెల్లి కుమార్‌, నాగులశంకరయ్య పాల్గొన్నారు.

Updated Date - 2020-10-01T10:38:34+05:30 IST