Advertisement
Advertisement
Abn logo
Advertisement

మృతుడి కుటుంబానికి ఎమ్మెల్యే ఆర్థికసాయం

భూదాన్‌పోచంపల్లి, డిసెంబరు 1: మండలంలోని ఇంద్రియాల గ్రామా నికి చెందిన టీఆర్‌ఎస్‌ గ్రామశాఖ అధ్యక్షుడు గంగపురం జగతిగౌడ్‌ ఇటీవల మృతి చెందగా, ఆయన కుటుంబానికి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి రూ.1.20 లక్షల ఆర్థికసాయం అందజేశారు. హైదరాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలో గురువారం జగతిగౌడ్‌ సతీమణి లావణ్యకు  చెక్కును ఎమ్మెల్యే  అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాడ్గుల ప్రభాకర్‌రెడ్డి, జడ్పీటీసీ కోట పుష్పలత మల్లారెడ్డి, వైస్‌ ఎంపీపీ పాక వెంకటేశంయాదవ్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ కందాడి భూపాల్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పాటి సుధాకర్‌రెడ్డి, ఇంద్రియాల సర్పంచ్‌ దొడ్డి అలివేలు, ఎంపీటీసీ యాదగిరి,  నోముల మాధవరెడ్డి పాల్గొన్నారు.Advertisement
Advertisement