కరోనా మృతదేహాలను తరలించేందుకు ఉచిత వాహనాలు

ABN , First Publish Date - 2021-05-17T06:02:02+05:30 IST

కరోనాతో మృతి చెందిన వారి మృతదేహాల ను శ్మశాన వాటికలకు ఉచితంగా తరలించేందుకు పురపాలక సంఘం ఏర్పాటు చేసింది. ఈ వాహనాలను ఆదివారం ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు.

కరోనా మృతదేహాలను తరలించేందుకు ఉచిత వాహనాలు
వాహనాలను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి

ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి

నరసరావుపేట, మే 16 : కరోనాతో మృతి చెందిన వారి మృతదేహాల ను శ్మశాన వాటికలకు ఉచితంగా తరలించేందుకు పురపాలక సంఘం ఏర్పాటు చేసింది. ఈ వాహనాలను ఆదివారం ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. కొవిడ్‌ మృతుల అంత్యక్రియలు, మృతదే హాలను తరలించేందుకు వాహనాలకు ఎవరూ ఒక్క రూపాయి కూడా ఇవ్వవలసిన అవసరం లేదని ఎమ్మెల్యే తెలిపారు. ఈ ఖర్చు పూర్తిగా పురపాలక సంఘం భరిస్తుంద ని చెప్పారు. లింగంగుంట్లలోని ప్రభుత్వ కొవిడ్‌ ఆస్పత్రి ద్వారా కరోనా బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్టు తెలిపారు. ఇక్కడి సేవలను బాధితులు సద్వినియోగ పరచుకోవాలని కోరారు. అక్సిజన్‌ కొరత లేకుండా ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. అక్సిజన్‌ కోసం కేంద్ర ప్ర భుత్వంకు లేఖ రాయగా జాం నగర్‌ నుంచి ప్రత్యేక రైలు ద్వారా మన రాష్ట్రానికి ఆక్సిజన్‌ చేరుకుందని తెలిపారు. వాహనాల కోసం బాలాజీ : 9440447821, వినోద్‌ : 8328389288 నెంబర్లలో సంప్రదించాలని చెప్పా రు. కరోనాతో మృతి చెందిన వారి కుటుంబాలకు అంత్యక్రియలు, వాహ నాలకు ఖర్చు లేకుండా ఇవి ఉచితం చేయడంలో ఎమ్మెల్యే డాక్టర్‌ గోపి రెడ్డి శ్రీనివాసరెడ్డి విశేషంగా కృషి చేశారు. ఈ కార్యక్రమంలో మునిసిప ల్‌ కమిషనర్‌ కె.రామచంద్రా రెడ్డి, డీఈ శ్రీనివాసరావు పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-17T06:02:02+05:30 IST