Abn logo
Oct 26 2021 @ 12:43PM

ఏపీలో కోటి కేజీల గంజాయి ఉత్పత్తి: గోరంట్ల

రాజమండ్రి: ఏపీలో కోటి కేజీల గంజాయి ఉత్పత్తి అవుతుందని టీడీపీ ఎమ్మెల్యే  గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గంజాయి ఉత్పత్తిని ఆపలేకపోతున్నారని, పోలీస్ శాఖ గంజాయిని ఎందుకు ఆపలేకపోతోందని ప్రశ్నించారు. సారాయిని రంగుగా మార్చి విస్కీ, బ్రాందీలుగా అమ్ముతున్నారని, బాటిల్‌లో సారా వేసి 100 రూపాయిలకు అమ్ముతున్నారని విమర్శించారు. సారా వ్యాపారం రాజమండ్రి ఎంపీకి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. ఏపీ అవినీతికి పరాకాష్ఠని, ముఖ్యమంత్రికి మతి తప్పిందని, చికిత్స చేయించాలన్నారు. 


సారాలో ఎంపీ మార్గాని భరత్ పాత్ర ఏంటని బుచ్చయ్య చౌదరి ప్రశ్నించారు. ఇళ్ళ స్థలాల ముసుగులో ఎంపీ దోపిడీకి పాల్పడుతున్నారని, ఆయన నాయకత్వంలో రూ. 100 కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. సారా అమ్మిస్తున్నందుకు ఎంపీని జైలులో పెట్టాలన్నారు. ఎమ్మెల్యే ద్వారం పూడి చంద్రశేఖర్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. ఎమ్మెల్యే త్వరలోనే జైలుకు వెళ్ళడం ఖాయమన్నారు. ఆర్థిక ఉగ్రవాది చేతిలో రాష్ట్రం నష్టపోతోందన్నారు. టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టినప్పుడు పోలీస్ సంఘాల నేతలు ఎందుకు మాట్లాడంలేదని ప్రశ్నించారు. వేమగిరిలో కొండను తవ్వేసి రూ. 60 కోట్లు దోచేశారని, ఎంపీ భరత్ అండదండలతోనే కొండను తవ్వేశారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు.

ఇవి కూడా చదవండిImage Caption