Abn logo
Sep 23 2021 @ 00:37AM

రుణాలను సద్వినియోగం చేసుకోండి

ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి.. డ్వాక్రా సంఘాలకు రూ.83 కోట్ల రుణాల పంపిణీ

అనంతపురం క్లాక్‌టవర్‌, సెప్టెంబరు 22: పూచీకత్తు లేకుండా యూనియన బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అంది   స్తున్న రూ.20 లక్షల రుణాలను జీవనోపాధుల పెంపు, ఆర్థిక స్వావలంబన కోసం సద్వినియోగం చేసుకోవాలని  ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. బుధవారం స్థానిక అశోక్‌నగర్‌లోని ఎస్‌వీఆర్‌ ఫంక్షనహాల్లో యూనియన బ్యాంకు ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో జిల్లాలోని 58 శాఖల ద్వారా 760 స్వయం సహాయక సంఘాల మహిళలకు రూ.83 కోట్లు రుణాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రస్తుత పోటీ సమాజంలో పురుషులు ఎన్ని బ్యాంకులు తిరిగినా పూచీకత్తు లేకుండా రూ.లక్ష కూడా రుణం తీసుకోలేని పరిస్థితుల్లో.. మహిళల్లో జీవనోపాధుల పెంపు, ఆర్థిక స్వావలంబన కోసం యూనియన బ్యాంకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. యూనియన బ్యాంకు ఆర్‌ఎం సింహాచలం మా ట్లాడుతూ ఇప్పటి వరకు జిల్లాలో 9380 స్వయం సహాయక సంఘాలకు రూ.360 కోట్లకు పైగా రుణాలు అందజేశామన్నారు. కార్యక్రమంలో మెప్మా పీడీ రమణారెడ్డి, డీ ఆర్‌డీఏ ఏపీడీ ఈశ్వరయ్య, యూనియన బ్యాంకు ఏజీఎం నరసింహం, బ్యాంకు అధికారులు, స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొన్నారు.