Abn logo
Sep 24 2021 @ 11:45AM

నేను టీఆర్ఎస్‌లోకి పోవాలనుకుంటే అడ్డెవరు?: జగ్గారెడ్డి

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి ఇంత లాయల్‌గా ఉంటే అవమానాలు చేస్తున్నారని, తాను టీఆర్ఎస్‌లోకి పోవాలని అనుకుంటే అడ్డుకునేదెవరని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో చిట్ చాట్‌గా మాట్లాడుతూ.. గజ్వేల్ సభలో గీతా రెడ్డీ తనకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదన్నారు. గీతా రెడ్డి అంటే గౌరవమే..కానీ గజ్వేల్ సభలో తనకు అవమానం జరిగిందన్నారు. తాను కూడా రెండు లక్షల మందితో సభ పెట్టగలనని, రాష్ట్రంలో తనకూ అభిమానులు ఉన్నారని చెప్పారు. పార్టీ కోసం పని చేసే తనకే  అవమానాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో మాట్లాడే అవకాశం దొరకడం లేదు కాబట్టి మీడియాతో మాట్లాడుతున్నానని జగ్గారెడ్డి అన్నారు.

ఇవి కూడా చదవండిImage Caption