Abn logo
Jun 11 2021 @ 16:06PM

కేంద్రాన్ని కేసీఆర్ ఎందుకు ప్రశ్నించట్లేదు?: జగ్గారెడ్డి

సంగారెడ్డి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏడేళ్లలో ప్రజలపై మోయలేని భారాన్ని మోపుతున్నారని కాంగ్రెస్ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు.  శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అంతర్జాతీయ మార్కెట్లలో క్రూడాయిల్ ధరలు తక్కువగా ఉన్నప్పటికీ.. పెట్రోల్, డీజిల్ ధరలను ఇబ్బడిముబ్బడిగా పెంచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రాన్ని సీఎం కేసీఆర్ ఎందుకు ప్రశ్నించడం లేదు? అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. టీఆర్ఎస్, బీజేపీల మధ్య అంతర్గత అవగాహన ఉందని జగ్గారెడ్డి అన్నారు. 

Advertisement