ప్రతి గ్రామం ఆదర్శగ్రామం కావాలి : ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2020-06-04T10:27:39+05:30 IST

నియోజకవర్గంలోని ప్రతి గ్రామం ఆదర్శ గ్రామంగా నిలవాలని ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు.

ప్రతి గ్రామం ఆదర్శగ్రామం కావాలి : ఎమ్మెల్యే

పొదలకూరురూరల్‌, జూన్‌ 3 : నియోజకవర్గంలోని ప్రతి గ్రామం ఆదర్శ గ్రామంగా నిలవాలని ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని ఇనుకుర్తి, ముదిగేడు గ్రామాలలో ఆయన బుధవారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు  చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో అవసరమైన తాగునీరు, సాగునీరు, రోడ్లు, కాలువలు, స్కూళ్లు, శ్మశాన వాటికలు అభివృద్ధి పరచనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా గర్భిణీలకు మేలు రకం బియ్యం పంపిణీ చేశారు. 

Updated Date - 2020-06-04T10:27:39+05:30 IST