గుంటూరు: బీజేపీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ అవుట్ డేటెడ్ లీడర్ అని ఎమ్మెల్యే మద్దాలి గిరి ఎద్దేవా చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గుంటూరుకు కన్నా చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. తానే అంతా చేశానని గొప్పలు మానుకోవాలని హితువు పలికారు. మంత్రిగా ఉన్న సమయంలో గుంటూరుకు కనీసం తాగునీరు కూడా ఇవ్వలేకపోయారని ఎద్దేవా చేశారు. ప్రజలు కన్నాను మర్చిపోకుండా ఉండేందుకే మీడియాలో విమర్శలు చేస్తున్నారని చెప్పారు. జగన్ పాలనలో పారదర్శక పాలన జరుగుతోందని మద్దాలి గిరి పేర్కొన్నారు.