Abn logo
Sep 28 2021 @ 22:28PM

ఎమ్మెల్యే ‘మల్లాది’ వ్యాఖ్యలపై యూటీఎఫ్‌ నిరసన

గేట్‌ సెంటర్‌ కూడలి వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న యూటీఎఫ్‌ నాయకులు

 పొదలకూరు, సెప్టెంబరు 28 : ఉద్యోగ, ఉపాధ్యాయులకు సీపీఎస్‌ రద్దు చేయాలని, పీఆర్‌సీ, డీఏలు చెల్లించాలని ప్రస్తావించిన పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు (ఐవీ)పై విజయవాడ ఎమ్మెల్యే మల్లాది విష్ణు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ పొదలకూరు యూటీఎఫ్‌ నాయకులు మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావుకు ఎమ్మెల్యే విష్ణు వెంటనే క్షమాపణ చెప్పాలని యూటీఎఫ్‌ మాజీ జిల్లా కార్యదర్శి బి.వెంకటేశ్వర్లు, గౌరవాధ్యక్షుడు బి.పెంచలరెడ్డి డిమాండ్‌ చేశారు. యూటీఎఫ్‌ భవనం నుంచి నల్ల రిబ్బన్లు ధరించి నిరసన ర్యాలీని గేట్‌ సెంటర్‌ వరకు కొనసాగించారు. అనంతరం మల్లాది విష్ణు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ పలువురు నాయకులు మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పి.సుభాషిణి, అధ్యక్షుడు రవి, జిల్లా కౌన్సిలర్లు జయరామయ్య, సుబ్బారావు, అరుణ, రాఘవేంద్ర, కె.వెంకటేశ్వర్లు, నాగయ్య, పెంచలనరసయ్య, తదితరులు పాల్గొన్నారు.