Advertisement
Advertisement
Abn logo
Advertisement

అధికారులు అప్రమత్తంగా ఉండాలి

ఎమ్యెల్యే మేకపాటి 

ఉదయగిరి, నవంబరు 28: ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు నియోజకవర్గంలోని అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎమ్యెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి సూచించారు. ఆదివారం ఉదయగిరి ఆనకట్ట నీటి ప్రవాహాన్ని ఆయన పరిశీలించి వివిధ శాఖల అధికారులతో చర్చించారు. నియోజకవర్గంలోని 8 మండలాల్లో ఇటీవల కురిసిన వర్షాలకు చెరువులకు నీరు పుష్కలంగా చేరిందన్నారు. కొన్ని చెరువులు అలుగులు పారగా మరికొన్ని చెరువులు అలుగులు పారే దశలో ఉన్నాయన్నారు. రెండో విడత వర్షాలు జోరుగా కురుస్తున్నాయని, ఇలాంటి తరుణంలో వర్షపు నీరు చేరి చెరువు కట్టలు తెగే ప్రమాదం పొంచి ఉందన్నారు. దీంతో అన్ని మండలాల్లో అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేసామన్నారు. నియోజకవర్గంలో దెబ్బతిన్న వివిధ రకాల పంటలు, రోడ్ల మరమ్మతులకు నిధుల మంజూరుకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, జిల్లా కలెక్టరు చక్రధరబాబులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని కోరారు. ఆనకట్ట వద్ద అలుగు ఉధృతికి పాదాచారుల రాకపోకలు నిలిచిపోవడంతో సీఐ గిరిబాబు, ఎస్‌ఐ అంకమ్మ పోలీసు సిబ్బందితో తాడును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్‌ అక్కి భాస్కరరెడ్డి, వెంగళరెడ్డి, గానుగపెంట ఓబులరెడ్డి, సయ్యద్‌ గౌస్‌మోహిద్ధీన్‌, మట్ల రామయ్య, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement