ఉత్సవ ఏర్పాట్లను వేగవంతం చేయండి: ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2021-10-13T05:09:50+05:30 IST

ఉత్సవ ఏర్పాట్లను వేగవంతం చేయండి: ఎమ్మెల్యే

ఉత్సవ ఏర్పాట్లను వేగవంతం చేయండి: ఎమ్మెల్యే
రంగలీల మైదానం పరిశీలనకు వచ్చిన ఎమ్మెల్యే, అధికారులు

ఏకశిలనగర్‌(వరంగల్‌), అక్టోబరు 12: నగరంలోని ఉర్సు రంగలీల మైదా నంలో సద్దుల బతుకమ్మ, దసరా ఉత్సవాలను పురస్కరించుకుని ఏర్పాట్లను వేగవంతంగా నిర్వహించాలని వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉర్సు గుట్ట రంగలీల మైదానాన్ని కలెక్టర్‌ గోపి, సీపీ తరుణ్‌జోషి, గ్రేటర్‌ కమిషనర్‌ ప్రావీణ్య, అడి షనల్‌ కలెక్టర్‌ హరిసింగ్‌లతో కలిసి సందర్శించారు. ఉర్సు చెరువులో గుర్రపు డెక్క, రంగలీల మైదానంలో గుంతలను పూడ్చి లెవల్‌ చేయాలని అధికారు లను ఎమ్మెల్యే ఆదేశించారు. ఉత్సవాల కోసం సౌండ్‌, లైటింగ్‌, సీటింగ్‌, ఎల్‌ ఈడీ స్ర్కీన్‌లను ఏర్పాటు చేయాలన్నారు. వైద్య సిబ్బంది, 104, 108, ఫైర్‌ ఇంజన్‌ను నిలపాలన్నారు. పోలీసుల బందోబస్తు, ట్రాఫిక్‌ డైవర్షన్‌ ఏర్పాటు, పార్కింగ్‌ స్థలాలను ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో దసరా ఉ త్సవ కమిటీ అధ్యక్షుడు నాగపురి సంజయ్‌బాబు, ప్రధాన కార్యదర్శి బండి కుమారస్వామి కోశాధికారి మండ వెంకన్న, కన్వీనర్‌ వొడ్నాల నరేందర్‌, గోనె రాంప్రసాద్‌, వంగిరి కోటేశ్వర్‌, మేడిది మధుసూదన్‌, వెలిదె శివమూర్తి, వంచనగిరి సమ్మయ్య, వొగిలిశెట్టి అనిల్‌కుమార్‌, నాగపురి రంజిత్‌, పోగాకు సందీప్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-13T05:09:50+05:30 IST