రూ.9 కోట్లతో పైపులైను పనులు

ABN , First Publish Date - 2020-12-04T06:00:34+05:30 IST

నగరంలోని కాకుమానివారితోటలో రూ.9 కోట్ల వ్యయంతో చేపట్టే పైపులైను పనులకు తూర్పు ఎమ్మెల్యే ఎండీ ముస్తఫా గురువారం శంకుస్థాపన చేశారు.

రూ.9 కోట్లతో పైపులైను పనులు
పైపులైన్‌ పనులకు శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే ముస్తఫా

శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ముస్తఫా

గుంటూరు, డిసెంబరు 3: నగరంలోని కాకుమానివారితోటలో రూ.9 కోట్ల వ్యయంతో చేపట్టే పైపులైను పనులకు తూర్పు ఎమ్మెల్యే ఎండీ ముస్తఫా గురువారం శంకుస్థాపన చేశారు. మూడు దశబ్దాల కిందట ఏర్పాటు చేసిన పైపులైనుతో లీకులు ఏర్పడి కలుషిత నీటితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు. అందువల్ల వాటి స్థానంలో కొత్త పైపులైన్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.  కార్యక్రమంలో జీఎంసీ అధికారులు రవికృష్ణంరాజు, శాంతిరాజు, వెంకటేశ్వరరావు, మార్కెట్‌యార్డు వైస్‌ చైర్మన్‌ శృంగారపు శ్రీనివాసరావు, నాయకులు రమణయ్య, అంబేడ్కర్‌, సాల్మన్‌, తుమ్మేటి శ్రీను, రాజు, వాసు, మరియమ్మ తదితరులున్నారు. 

ముస్లింమైనార్టీలపై టీడీపీది కపట ప్రేమ..


అధికారం కోల్పోయే సరికి ముస్లిం మైనార్టీలపై టీడీపీ కపట చూపుతూ ఛలో అసెంబ్లీ పేరుతో రాజకీయం చేయటం తగదని ఎమ్మెల్యే ముస్తఫా విమర్శించారు. బస్టాండ్‌ రోడ్డులోని కార్యాలయంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నంద్యాల ఘటనపై ఏ ప్రభుత్వం చేయని విధంగా పోలీసులను అరెస్టు చేయించిందన్నారు. అనంతరం వారి బెయిల్‌పై సుప్రీంకోర్టుకు వెళ్ళి పిటిషన్‌ దాఖలు చేసినట్లు తెలిపారు. గతంలో ఓ సభలో ప్రశ్నించిన ముస్లిం యువతపై దేశద్రోహం కేసు పెట్టించిన చరిత్ర స్థానిక టీడీపీ నాయకులదన్నారు. 


Updated Date - 2020-12-04T06:00:34+05:30 IST