నా ఇల్లు.. నా సొంతం..

ABN , First Publish Date - 2020-10-30T04:03:31+05:30 IST

పట్టణ పేదల సొంత ఇంటి కల నెరవే ర్చడానికి టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించాలని కోరుతూ నా ఇల్లు.. నా సొంతం.. నినాదంతో ఉద్యమిస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తెలి పారు.

నా ఇల్లు.. నా సొంతం..
టీడీపీ సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు

నేటి నుంచి ఉద్యమిస్తాం : ఎమ్మెల్యే నిమ్మల

పాలకొల్లు అర్బన్‌, అక్టోబరు 29 : పట్టణ పేదల సొంత ఇంటి కల నెరవే ర్చడానికి టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించాలని కోరుతూ నా ఇల్లు.. నా సొంతం.. నినాదంతో ఉద్యమిస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తెలిపారు. పట్టణంలో శుక్రవారం నుంచి వార్డుల వారీగా పర్యటించనున్నట్టు  ఆయన తెలిపారు. పార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన టీడీపీ పట్టణ సమన్వయ కమిటీ సమావేశంలో నిమ్మల మాట్లాడారు. ప్రభుత్వం 16 నెలలుగా లబ్ధిదారులకు ఇళ్లను అప్పగించకుండా కాలయాపన చేస్తోందని ఎమ్మెల్యే రామానాయుడు విమర్శించారు. పాలకొల్లు పట్లణంలో సుమారు 7వేల ఇళ్లను నిర్మించడం జరిగిందన్నారు. అక్టోబరు 2న నా ఇల్లు నాసొంతం నినాదంతో ఆందోలన కార్యక్రమానికి రూపకల్పన చేశామన్నారు. పట్టణ పేద లకు సుమారు 10 కిలో మీటర్ల దూరంలోని గ్రామాల్లో ఇంటి స్థలాలను ఇవ్వడం సరికాదని, పేదవారి కోసం నిర్మించిన ఇళ్లను తక్షణం అప్పగించాల న్నారు. లేకుంటే ప్రతీ నెల రూ.3వేల అద్దెను ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో కర్నేని గౌరునాయుడు, పెచ్చెట్టి బాబు, ధనాని సూర్య ప్రకాశ్‌, మండాది అవినాష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-30T04:03:31+05:30 IST