Abn logo
Sep 27 2021 @ 14:29PM

మణికొండలో ఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్

హైదరాబాద్: మణికొండలో ఘటన స్థలాన్ని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గల్లంతైన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రజినీకాంత్ ఆచూకీ కోసం 10 బృందాలతో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటికీ గల్లంతైన వ్యక్తి ఆచూకీ లభించలేదన్నారు. ఘటనకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గల్లంతైంది రజినీకాంత్ అని అనుమానం మాత్రమేనని.. దీనిని ఆయన కుటుంబ సభ్యులు ధృవీకరించడం లేదని ప్రకాష్ గౌడ్ పేర్కొన్నారు.