సమగ్రాభివృద్ధే ధ్యేయం

ABN , First Publish Date - 2021-07-24T03:37:24+05:30 IST

కావలి నియోజకవర్గ సమగ్రాభివృద్ధే ధ్యేయమని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు.

సమగ్రాభివృద్ధే ధ్యేయం
మాట్లాడుతున్న ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌ రెడ్డి

ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి

కావలిటౌన్‌, జూలై 23: కావలి నియోజకవర్గ సమగ్రాభివృద్ధే ధ్యేయమని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ముసునూరులోని తన నివాసంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ శనివారం కావలి నియోజకవర్గంలో పర్యటించేందుకు వస్తున్న మంత్రులు పలు అభివృద్ధి పనులు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారన్నారు. నియోజకవర్గం శరవేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నానన్నారు. ఉదయం 9 గంటలకు ముసునూరులోని తన నివాసానికి మంత్రులు చేరుకుంటారన్నారు. అక్కడ నుంచి బయలుదేరి 9.30 గంటలకు మండల పరిషత్‌ కార్యాలయం వెనుక రూ.85 లక్షలతో నిర్మించిన డాక్టర్‌ వైఎస్సార్‌ అగ్రి టెస్టింగ్‌ ల్యాబ్‌ భవనాన్ని ప్రారంభిస్తారన్నారు. 9.50 గంటలకు ఆముదాలదిన్నెలో పచ్చతోరణం కార్యక్రమంలో భాగంగా  మొక్కలు నాటుతారని, 10 గంటలకు రూ.15 లక్షలతో నిర్మించిన సైడ్‌ కాలువలు పారంభిస్తారని తెలిపారు. 10.30 గంటలకు తాళ్లపాలెంలో రూ.45 లక్షలతో నిర్మించిన సచివాలయ భవనాన్ని ప్రారంభించిన అనంతరం ఉపాధి కూలీలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారన్నారు. 11.10 గంటలకు తుమ్మలపెంటకు చేరుకుని రూ.64 కోట్లతో నిర్మించనున్న జలజీవన్‌ మిషన్‌ ఫైలాన్‌ను ఆవిష్కరిస్తారని, రూ.10 కోట్లతో నిర్మించనున్న రోడ్డుకు శంకుస్థాపన చేస్తారని  పేర్కొన్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు దగదర్తి చేరుకుని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు. ఈ సమావేశంలో నేతలు కేతిరెడ్డి శివకుమార్‌ రెడ్డి, కనమర్లపూడి నారాయణ, గంధం ప్రసన్నాంజనేయులు, కుందుర్తి కామయ్య, వడ్లమూడి వెంకటేశ్వర్లు, నెల్లూరు వెంకటేశ్వర్లురెడ్డి, కోటా వెంకట్‌, వేమిరెడ్డి విజయకుమార్‌రెడ్డి, జీవెంకటేశ్వర్లు, డేగా రాము, యల్లంటి ప్రభాకర్‌, మందా శ్రీనివాసులు, ఇర్మియ ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-24T03:37:24+05:30 IST