వర్షంలోనే ఎమ్మెల్యే నిరసన

ABN , First Publish Date - 2020-09-19T18:42:57+05:30 IST

నలుగురికి అన్నంపెట్టే రైతుల పొలాలు ముంపునకు గురైనప్పుడు అధికారులే ఆదుకోకపోతే ఎలా ? అంటూ వారి వైఖరికి నిరసనగా.. అన్నదాతలతో కలిసి ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు వర్షంలోనే నిరసన తెలి పారు. పాలకోడేరు మండలం

వర్షంలోనే ఎమ్మెల్యే నిరసన

ముంపునకు గురైన పంట పొలాలను పట్టించుకోని అధికారులు


పాలకోడేరు(ఆంధ్రజ్యోతి): నలుగురికి అన్నంపెట్టే రైతుల పొలాలు ముంపునకు గురైనప్పుడు అధికారులే ఆదుకోకపోతే ఎలా ? అంటూ వారి వైఖరికి నిరసనగా.. అన్నదాతలతో కలిసి ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు వర్షంలోనే నిరసన తెలి పారు. పాలకోడేరు మండలం మోగల్లు పంచాయతీ పరిధిలోని గుత్తులవారిపాలెంలో పంట పొలాలు మునిగిపోతున్నాయంటూ ఆదుకోవాలని ఎమ్మెల్యే దృష్టికి రైతులు తీసుకువెళ్లారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే మోగల్లులోని పొలాలను శుక్రవారం పరిశీలించారు. 


ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామంలోని వడ్లవానికోడుకు మేలో అధికారులు షట్టర్లు వేయించి, వాటికి బిల్లులు చేసేశారన్నారు. ఆ షట్టర్లు ఎం దుకు పనిచేయకుండా పోయాయని దీనివల్లే పంట పొలాలు ముంపునకు గురయ్యాయన్నారు. ఆ షట్టర్లను అధికారుల దృష్టికి తీసుకు వెళదామని వస్తే అధికారులు ఆ ప్రాంతానికి రాకపోవడం దారుణమన్నారు. గోస్తనీ కాల్వ ఉధృతి ఇంకా ఎక్కువ అవుతుందని పంట పొలాలు బతికే పరిస్థితి లేదన్నారు. అధికారులు సమాధానం చెప్పే  వరకు నిరసన చేపడతానని అన్నారు. రాత్రి ఎనిమిదిన్నర ప్రాంతంలో డీఈ సుబ్ర హ్మణ్యం వచ్చి సమస్య పరిష్కారానికి హామీ ఇవ్వడంతో ఆయన దీక్ష విరమించారు. 

Updated Date - 2020-09-19T18:42:57+05:30 IST