Abn logo
Sep 20 2021 @ 01:27AM

గణేష్‌ మండపాల వద్ద ఎమ్మెల్యే పూజలు

శాంతినగర్‌లో గణనాథుడికి పూజలు చేస్తున్న ఎమ్మెల్యే జోగు రామన్న

ఆదిలాబాద్‌ టౌన్‌, సెప్టెంబరు 19: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లావ్యాప్తంగా ఆయా మండపాల్లో ప్రతిష్ఠించిన వినాయక విగ్రహాల నిమజ్జనాన్ని శాంతియుతంగా జరుపుకోవాలని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన వినాయక నిమజ్జన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై పాల్గొన్నారు. పలు గణేష్‌ మండలిలను సందర్శించి విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శాంతినగర్‌లోని శాంతిగణేష్‌ మండలి గణపతికి పూజలు చేశారు. లడ్డూ వేలం పాటలో గెలుపొందిన అభ్యర్థికి ఎమ్మెల్యే చేతుల మీదుగా లడ్డూను అందజేశారు. ఇందులో రెవెన్యూ సిబ్బందితో పాటు మున్సిపల్‌ అధికారులు, పోలీసులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.